బ‌ళ్లారి వార‌సుడు ఎన్టీఆర్ కి వీరాభిమాని!

Update: 2022-09-09 04:32 GMT
బ‌ళ్లారి పేరు విన‌గ‌నే తొలిగా వినిపించే ఏకైక పేరు గాలి జ‌నార్థ‌న రెడ్డి. ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అత్యంత స‌న్నిహితుడు అత‌డు. క‌ర్నాట‌క- బ‌ళ్లారి రాజ‌కీయాల‌కు ఎంత ప్రసిద్ధి చెందిందో సినిమాల పిచ్చి ప‌రంగానూ అంతే ప్రాముఖ్య‌త వ‌హించింది. ఇక్క‌డ థియేట‌ర్ల ముందు మాస్ జ‌నాల పిచ్చి వీరంగం చాలాసార్లు బ‌య‌ట‌ప‌డింది.

మ‌న మాస్ హీరోల‌కు అక్క‌డ భారీ ఫాలోయింగ్ ఉంది. ఆంధ్రాకు పొరుగున ఉన్న బ‌ళ్లారిలో తెలుగు సినిమాలు రికార్డ్ బ్రేకింగ్ వ‌సూళ్ల‌ను సాధిస్తున్నాయంటే అక్క‌డ మాస్ లో ఉన్న ఫాలోయింగ్ అలాంటిది. బ‌ళ్లారి బావ‌! అంటూ ప్ర‌ముఖ‌ లిరిసిస్ట్ త‌న పాట‌లో ప‌ద‌జాలాన్ని ఉప‌యోగించారంటే 'బ‌ళ్లారి' అనే ప‌దానికి ఉన్న సూప‌ర్ ప‌వ‌ర్  ఎలాంటిదో అర్థం చేసుకోవ‌చ్చు.

బ‌ళ్లారిలో టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కి  గొప్ప ఫాలోయింగ్ ఉంది. అత‌డిని పిచ్చిగా అభిమానించే యువ‌కుల్లో బ‌ళ్లారి బావ గాలి జ‌నార్థ‌న రెడ్డి కుమారుడు ఉన్నారు. ఈ యంగ్ బోయ్ పేరు కిరీటిరెడ్డి. ప్ర‌స్తుతం హీరోగా ల‌క్ చెక్ చేసుకునేందుకు అత‌డు సిద్ధ‌మ‌వుతున్నాడు.

ఈ సంద‌ర్భంలో అత‌డు చెప్పిన కొన్ని మాట‌లు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. "బ‌ళ్లారిలో మేం సినిమా పిచ్చివాళ్లం. భాష‌తో ప‌ని లేకుండా అన్ని రకాల చిత్రాలను ప్రోత్సహిస్తాం. నేను వ్యక్తిగతంగా జూనియర్ ఎన్టీఆర్ ని ఆరాధిస్తాను. ఎన్టీఆర్ సార్ కి వీరాభిమానిని. అత‌డి డ్యాన్స్ లను ఎంతో ఇష్టపడతాను. ఆయన పాటలు కూడా అద్భుతంగా తెర‌కెక్కుతాయి" అని కిరీటిరెడ్డి అన్నారు.

బ‌ళ్లారి బావ వార‌సుడు ఎన్టీఆర్ కి వీరాభిమాని! అని ఒప్పుకున్నాం స‌రే.. ఇప్పుడు హీరో అవుతున్నందున తార‌క్ స్ఫూర్తితో క‌న్న‌డ సినిమాల్లో ఆ రేంజు చూపించేందుకు తానేం చేస్తాడు? అన్న‌ది చెప్పాల్సి ఉంది. డ్యాన్సులు.. న‌టన ప‌రంగా ఎన్టీఆర్ లోని గ్రేస్ ఈజ్ ని ఒడిసిప‌డితేనే ఈ కాంపిటీష‌న్ రంగంలో నిల‌దొక్కుకునేందుకు ఆస్కారం ఉంది. ఆర్థిక బ‌లం అంగ‌బ‌లం కొంత‌వ‌ర‌కూ మాత్ర‌మే.

ఆ త‌ర్వాత నిరూపించుకుని ముందుకు దూసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ విష‌యంలో కిరీటి రెడ్డి స‌త్తా ఎంతో చూడాలి. ఆర్.ఆర్.ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగేసిన తార‌క్ త‌దుప‌రి కొర‌టాల‌తో .. క‌న్న‌డిగ అయిన ప్ర‌శాంత్ నీల్ తో సినిమాలు చేస్తున్నాడు. కిరీటిరెడ్డి త‌లుచుకుంటే కేజీఎఫ్ ప్ర‌శాంత్ నీల్ తోనే సినిమా చేయ‌గ‌ల‌డు. కానీ అందుకు తొలుత అర్హ‌త సాధించాల్సి ఉంటుంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా ప‌రిణ‌తిని సంపాదించాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News