లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా మీద ఆయన తమ్ముడు గంగై అమరన్ విమర్శలు గుప్పించాడు. ఇళయరాజా తమిళులందరూ తల దించుకునేలా చేశారని గంగై అమరన్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇంతకీ అమరన్ ఇళయరాజాను ఇలా తిట్టిపోయడానికి కారణమేంటంటే.. ఆయన జాతీయ అవార్డును తిరస్కరించడమే. ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఇళయరాజాకు ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడి పురస్కారం దక్కింది. ఐతే పాటలకు.. నేపథ్య సంగీతానికి వేర్వేరుగా అవార్డుల్ని ప్రకటించడాన్ని ఇళయరాజా తప్పుబట్టారు. ఇలా కేవలం నేపథ్య సంగీతానికి మాత్రమే అవార్డు ఇవ్వడం తనను అవమానించడమే అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అవార్డు తనకు వద్దని తిరస్కరించారు. అవార్డుల కార్యక్రమానికి కూడా వెళ్లలేదు.
ఐతే ఆజతీయ అవార్డుల జ్యూరీ కమిటీలో సభ్యుడైన గంగై అమరన్ రాజా నిర్ణయాన్ని తప్పుబట్టారు. తమిళులందరూ ఆయనకు అవార్డు వచ్చినందుకు చాలా గర్వించారని.. కానీ ఆ అవార్డును తిరస్కరించడం ద్వారా ఆయన వాళ్లందరూ తలదించుకునేలా చేశారని విమర్శించారు. సంగీతానికి.. నేపథ్య సంగీతానికి అవార్డులు వేర్వేరుగా ఇవ్వడంలో తప్పేమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇళయరాజాకు అవార్డు తెచ్చిపెట్టిన ‘తారై తాపట్టై’ సినిమాలో నిజానికి పాటలేమీ అంత బాగోవని ఆయన అన్నారు. తన అన్నయ్యపై తనకు అపారమైన గౌరవం ఉందని.. కానీ అవార్డును తిరస్కరించిన విషయంలో ఆయన్ని సమర్థించలేనని గంగై అమరన్ అన్నారు. ఐతే ఇళయరాజాకు.. గంగై అమరన్ కు చాలా కాలంగా సంబంధాలు బాగాలేవు.