శాతకర్ణి ఫస్ట్ డే వసూళ్లు ఇవే..

Update: 2017-01-14 10:07 GMT
సంక్రాంతికి పోటాపోటీగా దిగిన అగ్రహీరోల సినిమాల్లో రెండోదిగా విడుదలైంది బాలకృష్ణ వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి.మెగాస్టార్ 150 చిత్రమైన ఖైదీకి పోటీగా వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిది. మౌత్ పబ్లిసిటీతో పాటు.. పాజిటివ్ రివ్యూలు శాతకర్ణికి మరింత బలాన్ని ఇచ్చాయని చెప్పాలి. ఒక రోజు ఆలస్యంతో పాటు.. థియేటర్ల పరిమితుల కారణంగా వసూళ్ల విషయంలో కాస్త వెనుకబడినట్లు కనిపించినా.. ఈ సినిమా థియేటర్లలో లాంగ్ రన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్న మాట వినిపిస్తోంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బాలయ్య సినిమాలకు మల్టీఫ్లెక్సుల్లో ఆదరణ కాస్త తక్కువ. ఆ కొరతను తీర్చేసింది శాతకర్ణి. ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ తో బాక్స్ ఫీస్ దగ్గర వసూళ్లను భారీగా మొదలైనట్లు చెప్పాలి. తొలిరోజు గ్రాస్ కలెక్షన్లు రూ.18.35కోట్లుగా చెబుతున్నారు.

ఏరియాల వారీగా వచ్చిన మొదటిరోజు కలెక్షన్లు చూస్తే..

నైజం – రూ.1.88కోట్లు

సీడెడ్ – రూ.2.07కోట్లు

ఉత్తరాంధ్ర – రూ.0.88కోట్లు

గుంటూరు – రూ.1.64 కోట్లు

కృష్ణా  -రూ.0.80కోట్లు

ఈస్ట్  - రూ.0.78కోట్లు

వెస్ట్  - రూ.1.34కోట్లు

నెల్లూరు – రూ.0.43కోట్లు

మొత్తంగా ఏపీ.. నైజాంలో మొదటి రోజు కలెక్షన్లు రూ.9.82కోట్లు కాగా.. వరల్డ్ వైడ్ కలెక్షన్లు రూ.12.75 కోట్లుగా చెబుతున్నారు. యూఎస్ లో రూ.1.73కోట్లు.. కర్ణాటకలో రూ.0.70 కోట్లు.. రెస్టాఫ్ ఇండియా.. రెస్టాఫ్ వరల్డ్ లోరూ.0.50 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లుగా తెలుస్తోంది.

తాజాగా విడుదలైన సినిమాల తర్వాత ఏపీ.. నైజాంలలో మొదటి రోజు డిస్ట్రిబ్యూటర్ షేర్స్ టాప్ 12 చిత్రాల్నిచూస్తే..

1.        ఖైదీ నంబరు 150 రూ.23.24కోట్లు

2.        బాహుబలి రూ.22.4కోట్లు

3.        సర్దార్ గబ్బర్ సింగ్ రూ.20.92కోట్లు

4.        జనతాగ్యారేజ్ రూ.20.49కోట్లు

5.        శ్రీమంతుడు రూ.14.72కోట్లు

6.        బ్రహ్మోత్సవం రూ.13.06కోట్లు

7.        బ్రూస్ లీ రూ.12.66కోట్లు

8.        నాన్నకు ప్రేమతో రూ.12.18 కోట్లు

9.        సరైనోడు రూ.10.96 కోట్లు

10.     అత్తారింటికి దారేది రూ.10.76కోట్లు

11.     ధ్రువ రూ.10.35కోట్లు

12.     గౌతమిపుత్ర శాతకర్ణి రూ.9.82కోట్లు

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News