కాస్త భారీతనం ముడిపడ్డ సినిమా అంటే చాలు.. నెలలు నెలలు చెక్కుతూ కూర్చుంటారు మన దర్శకుడు. చారిత్రక నేపథ్యంతో సినిమా అన్నా.. విజువల్ ఎఫెక్టుల మీద ఆధారపడ్డ చిత్రమైనా సంవత్సరాలు సంవత్సరాలు తీయాల్సిందే. కానీ డైరెక్టర్ క్రిష్ మాత్రం ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ లాంటి భారీ చిత్రాన్ని కేవలం 79 రోజుల్లో అవగొట్టేశాడు. సినిమా మొదలుపెట్టిన ఎనిమిది నెలల్లో విడుదలకు సిద్ధం చేసి ఔరా అనిపించాడు. ట్రైలర్లో విజువల్స్ చూసే ఈ సినిమాను ఇంత వేగంగా ఎలా పూర్తి చేయగలిగాడబ్బా అని అంతా చర్చించుకున్నారు. ఇప్పుడిక సినిమా చూశాక జనాల ఆశ్చర్యానికి అంతే లేదు. కేవలం టాలీవుడ్ వరకే కాదు.. మిగతా ఇండస్ట్రీల వాళ్లకు కూడా ‘శాతకర్ణి’ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
‘బాహుబలి’ సినిమాను ఏళ్లకు ఏళ్లు తీస్తున్న రాజమౌళి సైతం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చూసి ఆశ్చర్యపోయాడు. క్రిష్ నుంచి తాను నేర్చుకోవాల్సింది చాలా ఉందని నిర్మొహమాటంగా చెప్పేశాడు. రాజమౌళి మాత్రమే కాదు.. టాలీవుడ్ స్టార్ దర్శకులు.. ఆ మాటకొస్తే ఇండియాలో ఉన్న పెద్ద దర్శకులందరూ క్రిష్ నుంచి.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సరైన ప్రణాళిక ఉండి.. ఏం తీయాలో స్పష్టత ఉంటే.. ఎలాంటి సినిమానైనా తక్కువ రోజుల్లో మంచి క్వాలిటీతో పూర్తి చేయొచ్చని.. బడ్జెట్ ను అదుపులో ఉండొచ్చని.. అనుకున్న సమయానికి విడుదల చేయొచ్చని క్రిష్ నిరూపించాడు. ఇకపై మన స్టార్ డైరెక్టర్లందరూ కూడా ఇదే బాటలో నడుస్తూ.. తక్కువ రోజుల్లో సినిమాను పూర్తి చేయడం ద్వారా ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిస్తారని ఆశిద్దాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/