కమల్ హాసన్ లాంటి వాడు ఒక యువ సంగీత దర్శకుడి ప్రతిభకు ముగ్ధుడైపోయి.. వరుసగా తాను చేయబోయే నాలుగు సినిమాలకు అతణ్నే మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకోవడం అన్నది అరుదైన విషయం. తమిళ మ్యూజికల్ సెన్సేషన్ జిబ్రాన్ ఈ అరుదైన అవకాశం దక్కించుకున్నాడు. కమల్ తో అతను వరుసగా విశ్వరూపం-2.. ఉత్తమ విలన్.. పాపనాశం.. చీకటి రాజ్యం సినిమాలకు పని చేశాడు. ఈ సినిమాలకు చేస్తుండగానే తెలుగులోనూ మంచి మంచి అవకాశాలు పట్టేశాడు జిబ్రాన్. తెలుగులో అతడి తొలి సినిమా ‘రన్ రాజా రన్’ మ్యూజికల్ గా సూపర్ హిట్. తర్వాత ‘జిల్’ సినిమాతోనూ పర్వాలేదనిపించాడు.
కానీ ఆ తర్వాత జిబ్రాన్ తన మీద పెట్టుకున్న అంచనాల్ని అందుకోలేకపోయాడు. ఈ ఏడాది జిబ్రాన్ చేసిన ‘బాబు బంగారం’ కానీ.. ‘హైపర్’ కానీ.. ఆకట్టుకోలేకపోయాయి. ఈ దెబ్బకు జిబ్రాన్ కు మళ్లీ ఇంకో అవకాశం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. ప్రస్తుతం తెలుగులో ఒక్కటంటే ఒక్క సినిమా చేతిలో లేదు జిబ్రాన్ కు. తమిళంలో పరిస్థితి పర్వాలేదు. తెలుగులో పెద్ద సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ల కొరత ఉంది. అందరికీ దేవిశ్రీనే కావాలి. ప్రత్యామ్నాయాలు తగ్గిపోయాయి. తమన్.. అనూప్ రూబెన్స్ లాంటి వాళ్లు గ్యాప్ ను కొంత వరకే ఫిల్ చేస్తున్నారు. జిబ్రాన్ ఆరంభంలో చూపించిన ఊపు చూస్తే మున్ముందు పెద్ద పెద్ద అవకాశాలు పట్టేస్తాడనుకున్నారు. కానీ అతను ఆశించిన స్థాయిలో ఔట్ పుట్ ఇవ్వకపోవడంతో త్వరగా తెలుగు సినిమాల నుంచి కనుమరుగైపోయే పరిస్థితి వచ్చింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/