కేన్స్ పిలుపందుకున్న జిబ్రాన్

Update: 2015-05-18 19:30 GMT
యువ సంగీత దర్శకుడు జిబ్రాన్ కేన్స్ చిత్రోత్సవాల నుండి పిలుపు అందుకున్నాడు. సంగీత దర్శకుడిగా కాకుండా నిర్మాతగా ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో జిబ్రాన్ పాల్గోవడం విశేషం. జిబ్రాన్ చిన్ననాటి స్నేహితుడైన రతీంద్రన్ ఆర్ ప్రసాద్ దర్శకత్వం వహించిన స్వయెర్ ప్రొడక్షన్స్ అనే లఘు చిత్రానికి జిబ్రాన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేశారు. తన స్నేహితుడు చాలా ప్రతిభా వంతుడని వెండితెరను ఏలే సత్తా ఆయనకుందని ఖచ్చితంగా చెబుతున్నాడు జిబ్రాన్. 

30 నిమిషాల నిడివి గల ఈ చిత్రం పర్యావరణ ప్రేమికుడిగా వున్న వ్యక్తి కెమికల్ కంపెనీ అధినేతను చంపే కథాంశంతో రూపిందింది. సోషియో థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం కేన్స్ చిత్రోత్సవాలలో ప్రదర్శితం కానుంది. దీనికోసం శుక్రవారమే జిబ్రాన్ ఫ్లైట్ ఎక్కేసారని, 25న మళ్ళీ చెన్నై వస్తారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. కేవలం నాలుగు రోజుల్లో చిత్రీకరించిన ఈ సినిమాని త్వరలో చెన్నైలో ప్రదర్శించనున్నారు.  ఉత్తమ విలన్ సినిమా చివరి దశలోనే జిబ్రాన్ ఈ లఘు చిత్రానికి పనిచేశారుట.    
Tags:    

Similar News