ముంబై వీధుల్లో స్వేచ్ఛ‌గా తిరిగేస్తోన్న బ్యూటీ!

Update: 2022-09-11 10:23 GMT
హీరోయిన్లు వీధుల్లో రోడ్ల‌పై క‌నిపిస్తే స‌న్నివేశం ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. కుర్రాళ్లంతా ఆ న‌టిని చుట్టు ముట్టి సెల్ఫీలంటూ  మీద మీద‌కి ఎగ‌బ‌డ‌తారు. అదంతా అభిమానంతో చేసే ప‌నులు. చివ‌రికి ఎలాగూ కిందా మీద ప‌డి ఓ సెల్పీ సంపాదిస్తారు. హీరోయిన్లు అనే కాదు..సెల‌బ్రిటీలంద‌రి విష‌యంలోనూ ఇలాంటి స‌న్నివేశాలే చోటు చేసుకుంటాయి.

అందుకే వెనుక బాడీ గార్డులు...ట్రాఫిక్ జామ్ లు లాంటి ఇబ్బంద‌లు లేని స‌మ‌యాన్ని చూసుకుని బ‌య‌ట‌కు వెళ్తుంటారు. ప‌ని పూర్త‌యిన  వెంట‌నే తిరిగి ఇంటికొచ్చేస్తారు. కానీ ఇక్క‌డ ఈ భామ మాత్రం వీధుల‌న్నింటిని  చుట్టేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. అవును ఈ ఫోటో చూస్తే అది నిజ‌మే అనిపిస్తుంది. ఇదిగో ఇక్క‌డ క‌నిపిస్తోన్న బాలీవుడ్  బ్యూటీ జార్జియా ఆండ్రియాని ఇలా ముంబై రోడ్ల‌పై ఎంతో స్వేచ్ఛ‌గా తిరిగేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది.

క్రీమ్ క‌ల‌ర్ క్రాప్ టాప్..బ్లాక్ ప్యాంట్ ధ‌రించి రోడ్డుపై న‌డుచుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ వ‌స్తోంది. అయినా ఈ భామ‌ని చుట్టు ప‌క్క‌ల వారెవ్వ‌రు ప‌ట్టించుకున్న‌ట్లు లేదు. ఎదురుగా వ‌స్తున్న‌ వారు..చుట‌మ్టు ప‌క్క‌ల వారు ఎవ‌రి ప‌నుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. మ‌రి ఆమెను ఎవ‌రు గుర్తు ప‌ట్ట‌లేదంటారా? అంటే అలాగే అనుకోవాలేమో.

అవును ఆమె హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది. కానీ అంత‌గా ఫేమ‌స్ కాలేదు.  కాక‌పోతే ఆర్బాజ్ ఖాన్ గాళ్ ప్రెండ్ గా మాత్రం నెట్టింట పాపుల‌ర్ అయింది. కొంత కాలంగా ఇద్ద‌రు డేటింగ్ లో ఉన్నట్లు మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌చారం సాగుతోంది. విష‌యాన్ని క‌న్ప‌మ్ చ‌య‌లేదు గానీ జార్జియా మాత్రం ఆర్బాజ్ ప్రియురాలిగా బాగానే ఫేమ‌స్ అయింది.

ఆమె ఇండియాన్ కాక‌పోవ‌డం కూడా గుర్తించ‌డానికి  ఇబ్బంద‌నే చెప్పాలి. అమ్మ‌డిలో కొన్ని స‌న్నీలియ‌న్ పీచ‌ర్స్ అక్క‌డ‌క్క‌డా క‌నిపిస్తున్నాయి. జార్జియాది ఇట‌లీ. అక్క‌డ పుట్టి పెరిగి చ‌దువులు పూర్తిచేసింది. మోడ‌లింగ్ రంగం నుంచి సినిమాల్లోకి వ‌చ్చింది. సినిమాల‌పై   ఫ్యాష‌న్ తో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఇంకా ఎదిగే క్ర‌మంలోనే ఉంది. ఈ క్ర‌మంలోనే ఆర్బాజ్  ఖాన్ తో ప్రేమ‌లో ప‌డింది. 
Tags:    

Similar News