బిగ్‌బాస్‌ : హీరో నుండి జీరో అవుతున్నావు షన్నూ

Update: 2021-12-10 08:30 GMT
తెలుగు బిగ్‌ బాస్ సీజన్ 5 ముగింపు దశకు వచ్చేసింది. వచ్చే వారంతో ఈ సీజన్ ముగియబోతున్న నేపథ్యంలో విజేత ఎవరు అనే విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది. సీజన్ ఆరంభం నుండి అయిదు ఆరు వారాలు పూర్తి అయినంత వరకు కూడా చాలా మంది షన్నూ విజేత అంటూ చాలా బలంగా వాదిస్తూ వచ్చారు. యూట్యూబ్‌ సూపర్ స్టార్‌ అంటూ షన్నూ కు మంచి పేరు ఉంది. దాంతో అతడికి ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 5 విజేత అయ్యే అర్హత ఉందని అంతా నమ్మారు.

అయితే అతడు వ్యవహరిస్తున్న తీరుతో అతడిపై ఇష్టం కాస్త కోపంగా మారుతుంది అంటూ స్వయంగా ఆయన అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సిరితో అతడు వ్యవహరిస్తున్న తీరు.. పదే పదే ఏడవడం అలగడం చిరాకు పడటం బ్యాలన్స్ తప్పడం వంటివి చూస్తుంటే షన్నూ హీరో కాదు జీరో అనిపిస్తున్నాడు అంటూ స్వయంగా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

బిగ్ బాస్‌ సీజన్ 5 లో సన్నీ టాప్ లో ఉన్నాడు. షన్నూ ను మెల్ల మెల్లగా వెనక్కు నెట్టుకుంటూ సన్నీ చాలా ముందుకు వచ్చేశాడు. ఇప్పుడు ట్రోఫీ పూర్తి గా సన్నీ మరియు శ్రీరామ్ చంద్రల మద్య దోబూచులాడుతుందని విశ్లేషకులు అంటున్నారు. షన్నూ కనుక ముందే ఎలిమినేట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా సిరి టాప్ 2 లేదా 3 లో అయినా ఉండేది అంటూ విశ్లేషకుల అభిప్రాయం.

షన్నూ కారణంగా సిరి గేమ్‌ కూడా చెడి పోతుందని ఆమెను చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్‌ 5 లో ఒక హీరోగా ఎంట్రీ ఇచ్చిన షన్నూ తన ప్రవర్తన మరియు ఇతర విషయాల కారణంగా జీరో అయ్యాడు అంటూ బిగ్ బాస్ రివ్యూలు ఇచ్చే వారు చెబుతున్నారు.

షన్ను మరియు సిరిల మద్య ఏం ఉంది అంటే మొన్నటి వరకు మంచి స్నేహం ఉందని అంతా అనే వారు. కాని ఇప్పుడు ఇద్దరి మద్య ఏం ఉంది అంటే ఏం అర్థం కావడం లేదు అంటూ అంతా అంటున్నారు. మరీ సిరి తో షన్నూ వ్యవహరిస్తున్న తీరుకు ఎలాంటి పేరు పెట్టాలో తెలియడం లేదు అంటున్నారు.

సిరి మరియు షన్ను లు మంచి స్నేహితులుగా ఉన్నా కూడా ఖచ్చితంగా వారికి మంచి పేరు వచ్చేది. కాని వారిద్దరు కూడా పదే పదే గొడవ పడటం.. ముఖ్యంగా షన్ను చిన్నదానికి కూడా సిరిని ఇబ్బంది పెట్టేలా మాట్లాడటం.. ఆమెను ఏడిపించడం.. ఇంకా రకరకాలు గా వ్యవహరిస్తూ.. ప్రవర్తిస్తూ షన్నూ ఒక ఫన్నీ కంటెస్టెంట్‌ సిల్లీ కంటెస్టెంట్‌ అయ్యాడంటూ ప్రేక్షకులు స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా షన్నూ ను ట్రోల్‌ చేస్తున్నారు.
Tags:    

Similar News