బడా నిర్మాతలు గుణశేఖరుడికి యాంటి??

Update: 2015-09-27 04:43 GMT
నిన్న‌టిరోజున ఏపీ ఫిలింఛాంబ‌ర్‌ లో జ‌రిగిన ఓ స‌మావేశం గుణ‌శేఖ‌ర్ గుండెల్ని గుభేల్‌ మ‌నిపించింది. 70కోట్లు ధార‌పోసి, అహోరాత్రులు శ్ర‌మించి తెర‌కెక్కించిన రుద్ర‌మ‌దేవి 3డి విష‌యంలో విన‌కూడ‌నిది విన్నారు గుణ‌శేఖ‌ర్‌. మీ సినిమా రిలీజ్ ఆపుకోండి. వాయిదా వేసుకోండి అంటూ కొంద‌రు బ‌డా నిర్మాత‌ల నుంచి హ‌కుం జారీ అయ్యింది. అయితే ఇదంతా గుణ‌శేఖ‌రునిపై అగ్ర నిర్మాత‌ల దందాయేనా? అన్న సందేహాలొస్తున్నాయి. అయితే ఈ పోరులో గుణ‌శేఖ‌ర్ త‌న పంతాన్నే నెగ్గించుకునేందుకు రెడీ అవుతున్నార‌న్న‌ది అఫిషియ‌ల్ న్యూస్‌. ఇంకాస్త డీటెయిల్స్ లోకి వెళితే..

అనుష్క టైటిల్ పాత్ర‌లో రుద్ర‌మ‌దేవి 3డి అక్టోబ‌ర్  9 రిలీజ్ తేదీ అంటూ క‌న్ఫ‌మ్ చేసిన సంగ‌తి  తెలిసిందే. నిన్న‌టిరోజున రుద్ర‌మ‌దేవి 3డి మ‌రోసారి వాయిదా ప‌డింది అంటూ పుకార్లొచ్చాయి. ప్ర‌క‌టించిన తేదీకి రావ‌డం లేద‌న్న పుకార్లు శికారు చేశాయి. అయితే వీటికి గుణ‌శేఖ‌ర్ క్లారిటీ ఇచ్చారు. ఎట్టి ప‌రిస్థితిలో ప్ర‌క‌టించిన తేదీకే రుద్ర‌మ‌దేవిని రిలీజ్ చేస్తున్నాం. ఎలాంటి వాయిదా లేదని చెప్పారాయ‌న‌. తెలుగు - త‌మిళ్‌ - హిందీ - మ‌ల‌యాళం అన్ని వెర్ష‌న్‌ ల‌లో సేమ్ డే రిలీజ‌వుతుంద‌ని క్లారిటీ ఇచ్చారు.  అయితే ఈ రూమ‌ర్ ఎలా వ‌చ్చింది? అన్న దానికి క్లారిటీ వ‌చ్చింది. నిన్న‌టిరోజున తెలుగు ఫిలింఛాంబ‌ర్‌ లో జ‌రిగిన ఓ స‌మావేశంలో రుద్ర‌మ‌దేవి 3డిని వాయిదా వేయాల్సిందిగా కొంద‌రు నిర్మాత‌లు గుణ‌శేఖ‌ర్‌ ని కోరారు.              

వ‌రుస‌గా సినిమాల‌న్నీ రిలీజైపోతున్నాయ్‌. దీనివ‌ల్ల కొన్ని క‌లెక్ష‌న్ ల‌పై వాటి ప్ర‌భావం ప‌డుతుంది. డిసెంబ‌ర్‌ కి వాయిదా వేసుకోండి అని గుణ‌శేఖ‌ర్‌ కి కొంద‌రు సూచించారు. అయితే దానికి గుణ‌శేఖ‌ర్ స‌సేమిరా అన్నారు. య‌థాత‌థంగానే రిలీజ్ చేస్తాన‌ని అన్నారు. దీంతో అనుష్క న‌టించిన సైజ్‌ జీరో - రుద్ర‌మ‌దేవి 3డి ఒకే రోజు రిలీజ‌వ్వాల్సిన ప‌రిస్థితి వచ్చింది.  ఈ మొత్తం ఇన్సిడెంట్‌  లో కొంద‌రు అగ్ర నిర్మాత‌లు ఉద్ధేశ‌పూర్వ‌కంగానే గుణ‌శేఖ‌ర్‌ ని నిలువ‌రించాల‌నుకున్నారా? అన్న సందేహాలొస్తున్నాయ్‌. బ‌డా నిర్మాత‌లంతా గుణ‌శేఖ‌రుడికి యాంటీగా ఉన్నారా? అన్న డౌట్స్ వ‌చ్చాయి. ఓ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రాన్ని రిలీజ్ కాకుండా ఆపేయాల‌నుకుంటున్నారనే అనిపిస్తోంది.
Tags:    

Similar News