జనవరి నెలంతా సంక్రాంతి సినిమాలకే రాసిచ్చేశారు. ‘లక్కున్నోడు’ మినహాయిస్తే ఇంకే సినిమా కూడా రాలేదు. ఆ నెలలో. ఈ మధ్య కాలంలో ఇలా ఒక నెలలో తక్కువ సినిమాలు రావడం అంటే ఇదే. ఐతే ఫిబ్రవరిలో మళ్లీ కొత్త సినిమాల తాకిడి పెరిగింది. ప్రతి వారం కనీసం రెండేసి సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. తొలి వీకెండ్లో ‘నేను లోకల్’తో పాటు ‘కనుపాప’ కూడా రిలీజైంది. వచ్చే వారం ‘ఎస్-3’.. ‘ఓం నమో వెంకటేశాయ’ వస్తున్నాయి. చివరి వారంలో ‘విన్నర్’.. ‘యమన్’ విడుదలవుతాయి. మధ్యలో ఖాళీగా ఉన్న వారాంతానికి రెండు సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. అవే.. గుంటూరోడు.. కిట్టు ఉన్నాడు జాగ్రత్త.
ఐతే ఈ రెండు సినిమాలు ఒక సినిమాను కొంచెం లైట్ తీసుకున్నాయి. అదే.. రానా దగ్గుబాటి కథానాయకుడిగా నటించిన ‘ఘాజీ’. మూడు భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం చాన్నాళ్ల ముందే ఫిబ్రవరి 17న విడుదలకు ముహూర్తం చూసుకుంది. ఐతే ఇదేదో బాలీవుడ్ సినిమా అన్నట్లు.. ప్రయోగాత్మక చిత్రంగా భావించి దీన్ని లైట్ తీసుకున్నారు. కానీ ట్రైలర్ చూశాక జనాల ఆలోచనలు మారాయి. తెలుగులోనూ భారీ స్థాయిలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. విశాఖపట్నం నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి మన ప్రేక్షకులు కూడా బాగానే కనెక్టయ్యేలా ఉన్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా ఆకర్షణే. ఈ నేపథ్యంలో ‘గుంటూరోడు’.. ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమాలకు అంత వీజీ కాదు. కాబట్టి వీటిలో ఏదైనా ఒకటి వెనక్కి తగ్గుతుందేమో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/