అల్లుడికి పక్కన ఉండి సక్సెస్‌ కట్టబెట్టాడు

Update: 2019-02-01 07:43 GMT
17 ఏళ్ల వయసులోనే సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ మూవీకి సంగీతాన్ని అందించి అందరి దృష్టిని ఆకర్షించిన యువ సంగీత సంచలన జి. వి. ప్రకాష్‌ ఆ తర్వాత ఎన్నో తమిళ, తెలుగు సినిమాలకు సంగీతాన్ని అందించాడు. ఏఆర్‌ రహమాన్‌ అల్లుడు అనే ముద్ర నుండి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకుని సంగీత దర్శకుడిగా స్టార్స్‌ సరసన నిల్చున్నాడు. సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న తర్వాత జివి ప్రకాష్‌ హీరోగా తన అదృష్టంను పరీక్షించుకోవడం మొదలు పెట్టాడు.

తమిళంలో జివి హీరోగా పరిచయం అయ్యి చాలా కాలం అయ్యింది. కాని ఇప్పటి వరకు మంచి సక్సెస్‌ ను మాత్రం అందుకోలేక పోయాడు. హీరోగా కమర్షియల్‌ బ్రేక్‌ కోసం ఎదురు చూస్తున్న ఈయనకు తాజాగా నటించిన 'సర్వం తాళమయం' చిత్రం మంచి విజయాన్ని తెచ్చి పెట్టింది. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం అదే టైటిల్‌ తో విడుదల చేశారు. తమిళనాట ఈ చిత్రంకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది.

విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటున్న ఈ చిత్రంతో జివి హీరోగా మొదటి సక్సెస్‌ దక్కించుకున్నాడు. సంగీత నేపథ్యంలో తెరకెక్కిన మూవీ అవ్వడంతో ఈ సినిమాకు ఏఆర్‌ రహమాన్‌ సంగీతాన్ని అందించాడు. సంగీతం అందించడంతో ఏఆర్‌ రహమాన్‌ ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించినట్లయ్యింది. అల్లుడు సినిమాకు మంచి సంగీతాన్ని అందించి చాలా రోజులుగా ఎదురు చూస్తున్న సక్సెస్‌ ను కూడా కట్టబెట్టాడు. సంగీత దర్శకుడిగా మంచి సక్సెస్‌ లను దక్కించుకున్న జివి ఇన్నాళ్లకు హీరోగా కూడా సక్సెస్‌ ను దక్కించుకున్నాడు.
Tags:    

Similar News