బ్రాహ్మణుల గొడవకి బ్రాహ్మిణ్ రిప్లయ్

Update: 2017-06-02 13:34 GMT
గుడిలో బడిలో మదిలో ఒడిలో అంటూ కాస్త మాస్ గా అనిపించినా కూడా.. ఈ పాట మాత్రం  'అస్మైక యోగ.. తస్మైక భోగ.. రస్మైక రాగ హిందోళం'  అంటూ చాలా శాస్ర్తీయమైన లిరిక్స్ తో మొదలెట్టారు. ఆ సౌండింగ్ అంతా మాస్ ఆడియన్స్ కు బాగా నచ్చేస్తున్న వేళ ''డిజె దువ్వాడ జగన్నాథమ్'' సినిమాలోని ఈ పాటపై ఫిర్యాదు చేసిన కొందరు బ్రాహ్మణులు. తమ కమ్యూనిటీని అవమానించే విధంగా ఉందంటూ వ్రాతపూర్వక కంప్లయిట్ ఇచ్చి యాక్షన్ తీసుకోమన్నారు. ముఖ్యంగా రుద్ర స్తోత్రమ్ లోని పవిత్రమైన మాటలతో హీరోయిన్ అందాలను పొగడటం ఏంటి అని అడుగుతున్నారు.

ఇంతకీ ఈ విషయంపై ఈ సినిమాను తీసిన సాటి బ్రాహ్మిణ్‌ హరీశ్‌ శంకర్ ఏమంటున్నాడో తెలుసా? ''మేం ఏ స్తోత్రాన్ని అవమానించలేదు. ఏ పదాలను తప్పుగా ప్రయోగించలేదు. బ్రాహ్మణ్‌ అసోసియేషన్ వారు మేం వాడిన పదాలను తప్పుగా ఆపాదించుకుంటున్నారు'' అంటూ చెప్పాడు హరీశ్‌ శంకర్. అయితే ఇక్కడ హరీశ్‌ శంకర్ చెప్పినట్లు ఏదన్నా స్తోత్రాన్ని వాడారో లేదో తెలియదు కాని.. మొత్తంగా పాటంతా కూడా అమ్మాయి గ్లామర్ ను పొగడటానికే అన్నట్లుంది. సాహిత రాసిన ఈ లిరిక్స్ పై మరి ఎవరు క్లారిటీ ఇస్తారో మనం వేచి చూడాలి. అసలు సెన్సార్ బోర్డు వారు ఏమంటారో చూడాలి.

ఈ కాంట్రోవర్శీ అలా ఉంటే.. అటు ప్రక్కన ఆల్రెడీ 5 మిలియన్ వ్యూస్ కొల్లగొట్టిన ఈ సాంగ్ యుట్యూబ్ వీడియో.. ఇప్పుడు మరిన్ని హిట్స్ చెకాచెకా తెచ్చేసుకుంటోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News