'సైరా' వివాదం హరీష్ శంకర్ ఏమన్నాడంటే?

Update: 2019-09-30 15:51 GMT
మెగా స్టార్ ప్రెస్టీజియాస్ మూవీ సైరా చుట్టూ ఓ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ వివాదంపై లేటెస్ట్ గా రియాక్ట్ అయ్యాడు డైరెక్టర్ హరీష్ శంకర్.. ఇటివలే ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడాడు. ఇంత వరకూ తనకి ఉయ్యాల వాడ నరసింహ రెడ్డి వ్యక్తి గురించి తెలియదని తన అజ్ఞానికి క్షేమించాలని, చిరంజీవి గారు ఆయన మీద సినిమా చేయడం వాళ్ళే ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి గారి కీర్తి తెలిసిందని - ఇక మెగా స్టార్ అంతటి వాడు మా తాత కథతోనో - మా ముత్తాత కథతోనో సినిమా చేస్తే చిరంజీవి గారి కాళ్ళు అలాగే చరణ్ కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తి మీద చల్లుకునే వాణ్ణని అన్నాడు.

అలాగే వాల్మికీ విషయంలో కూడా టైటిల్ వివాదం చాలా వివాదం భాదపెట్టిందని ఆ సమయంలో ప్రమోషన్స్ తో బిజీ ఉన్నానని తెలిపాడు. ఇక కొందరు ఈ మధ్య సినిమాల చుట్టూ లేపే వివాదాలు మరీ దారుణం అనిపిస్తున్నాయని రిలీజ్ ముందు వరకూ ఆ వివాదాన్ని అలాగే ఉంచి భయపెడుతున్నారని అన్నాడు. ఇది కు సంస్కారం అంటూ చెప్పుకొచ్చాడు హరీష్.  

ఇక ఇంత వరకూ 'సైరా' వివాదంలో ఇండస్ట్రీ నుండి ఎవరూ నోరుమెదపలేదు. ఫస్ట్ టైం హరీష్ ఈ వివాదంపై స్పందించి మెగా అభిమానాన్ని చాటుకున్నాడు. ఇక వివాదం వల్ల సైరా రిలీజ్ కి ఆటంకం ఉంటుందనుకుంటే అలాంటివేం లేకుండానే సమస్య తొలగిపోయింది. ఈ వివాదంతో సినిమా విడుదలను ఆపలేం అంటూ కోర్టు కూడా చేతులెత్తేసింది. ఇక అనుకున్నట్లుగానే సైరా అక్టోబర్ 2న థియేటర్స్ లోకి రాబోతుంది.


Tags:    

Similar News