సీన్ క‌ట్ చెప్పాకా పెద‌వి ముద్దు ఆప‌డు!

ఆన్ లొకేష‌న్ స‌న్నివేశంలో నిర్మాత లేదా ద‌ర్శ‌కుడు ఎలాంటి ఏర్పాటు చేసారు?

Update: 2024-11-28 03:32 GMT

బోల్డ్ స‌న్నివేశాల్లో న‌టించేందుకు న‌టీమ‌ణులు సిద్ధ‌మైనా.. ఆ సీన్ తీసేప్పుడు చిత్ర‌యూనిట్ నుంచి న‌టీమ‌ణికి ఎలాంటి రక్ష‌ణ అవ‌స‌రం అనేదానికి ప్రామాణిక విధానాలు లేవు. ఆన్ లొకేష‌న్ స‌న్నివేశంలో నిర్మాత లేదా ద‌ర్శ‌కుడు ఎలాంటి ఏర్పాటు చేసారు?.. ఆ స‌మ‌యంలో మ‌హిళా స్టార్ల విష‌యంలో నియ‌మావ‌ళిని అనుస‌రించి హీరో లేదా న‌టుడు ప్ర‌వ‌ర్తిస్తారా? అన్న‌ది ప‌రిశీలిస్తే..

తాజా ఘ‌ట‌న భ‌య‌పెడుతోంది. ప్ర‌ముఖ న‌టి సయానీ గుప్తా ఒక భయానక సంఘటనను వెల్లడించారు. త‌న‌పై ద‌ర్శ‌కుడు ముద్దు స‌న్నివేశం తెర‌కెక్కిస్తున్నాడు. కానీ ఆ స‌మ‌యంలో త‌న స‌హ‌న‌టుడు నియ‌మాల‌కు క‌ట్టుబ‌డి లేడు. ఓవైపు సీన్ `క‌ట్‌` చెబుతున్నా అత‌డు దాని నుంచి బ‌య‌ట‌కు రాలేదు. పెద‌వి ముద్దుల్లో మునిగి తేలాడు.

మార్గరీటా విత్ ఎ స్ట్రా (2013)లో న‌టించేప్పుడు స‌యానీ గుప్తాకు ఈ ప్ర‌మాదం వాటిల్లింది. ఈ విష‌యంలో స‌ద‌రు న‌టీమ‌ణి ఖంగు తిన్నాన‌ని తెలిపింది. అయితే ఇలాంటి ఘాడ‌త ఉన్న‌ స‌న్నివేశాలు తెర‌కెక్కించేప్పుడు మేల్ స్టార్స్ వ‌ల్ల మ‌హిళా న‌టీమ‌ణులు ఇబ్బంది ప‌డ‌కుండా ప్ర‌త్యేక ఏర్పాటు ఉంటే మంచిది. అంద‌మైన జంట‌పై క్లోజ‌ప్ స‌న్నివేశాలు తెరకెక్కించేప్పుడు న‌టీమ‌ణుల ర‌క్ష‌ణ కోసం ఏదో ఒక ఏర్పాటు త‌క్ష‌ణావ‌స‌రం. జ‌స్టిస్ హేమ క‌మిటీ నివేదిక అనంత‌రం ఆన్ లొకేష‌న్ మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ ఎలా ఉంది? అన్న‌ది పెద్ద చ‌ర్చ‌గా మారింది.

Tags:    

Similar News