రాజ‌ధానిలో రామ్ చ‌ర‌ణ్ కుస్తీ ఫైట్!

ఆర్సీ 16 షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుగుతోంది. దీనిలో భాగంగా క్రికెట్ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు.

Update: 2025-02-23 17:30 GMT

ఆర్సీ 16 షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుగుతోంది. దీనిలో భాగంగా క్రికెట్ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్ స‌హా ప్ర‌ధాన తారాగ‌ణ‌మంతా షూట్ లో పాల్గొంటుంది. ఈ వారం రోజుల పాటు ఇవే స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ కొన‌సాగుతుంది. దీంతో షెడ్యూల్ పూర్త‌వుతుంది. మ‌రి త‌దుప‌రి షెడ్యూల్ సంగ‌తేంటి? అంటే మార్చి మొదటి వారంలో కొత్త షెడ్యూల్ దేశ రాజ‌ధాని ఢిల్లీలో మొద‌ల‌వుతుంద‌ని స‌మాచారం.

అక్క‌డ రెజ్లింగ్ కుస్తీ పోటీల‌కు సంబంధించిన స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తార‌ని స‌న్నిహితుల నుంచి లీకైంది. ఇందులో చ‌ర‌ణ్ పాల్గొంటాడు. అయితే చ‌ర‌ణ్ కి ధీటుగా కుస్తీకి దిగే న‌టుడు ఎవ‌రు? అన్న‌ది స‌స్పెన్స్. కుస్తీ స‌న్నివేశాలంటే ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఈ నేప‌థ్యంలో చ‌ర‌ణ్ కి ప్ర‌త్య‌ర్ధిగా పెద్ద స్టార‌రే త‌ల‌ప‌డే అవ‌కాశం ఉంది. అయితే ఈస‌న్నివేశాల‌కు ఢిల్లీ వేదిక అవ్వ‌డం అన్న‌ది చూస్తుంటే? సినిమాలో ఈ స‌న్నివేశాల‌కు చాలా ప్ర‌త్యేక‌త ఉండేలా క‌నిపిస్తుంది.

అయితే ఇవి ఒలిపింక్స్ గేమ్స్ లో భాగ‌మ‌వుతున్నాయా? కామన్వెల్త్ క్రీడీల్లో భాగంగా వ‌స్తాయా ? ఈ రెండు క్రీడలు కాకుండా క‌థా నేప‌థ్యానికి- క్రీడ‌ల‌కి ఇంకేదైనా సంబంధం ఉందా? అన్నది చూడాలి. సినిమాలో ఇంకా చాలా క్రీడ‌లు భాగ‌మ‌వుతున్నాయ‌ని ప్ర‌చారంలో ఉంది. అదే నిజ‌మైతే బుచ్చిబాబు బ‌ల‌మైన క‌థా నేప‌థ్యాన్నే ఎంచుకున్న‌ట్లే. గ్రామీణ నేప‌థ్యంలో క్రికెట్ ఆట గా తొలుత తెర‌పైకి వ‌చ్చిన స్టోరీలో ఇన్ని ట్విస్టులు ఊహించ‌లేనివే. మ‌రి బుచ్చిబాబు వీటిని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడో? చూడాలి.

ఈ చిత్రంలో శాండల్‌వుడ్ స్టార్ శివ రాజ్‌కుమార్ , మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టైటిల్ , టీజర్‌ను రామ్ చరణ్ పుట్టినరోజు సంద‌ర్భంగా మార్చి 27న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ -మైత్రీ మూవీ మేకర్స్ -సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

Tags:    

Similar News