సీ బ్యూటీ ముందు చెర్రీ పండులా!
బాలీవుడ్ బ్యూటీ షామా సికిందర్ వెండి తెరపై కనిపించి ఐదేళ్లు గడుస్తుంది. దాదాపు అమ్మడు ఇండస్ట్రీకి రిటైర్మెంట్ ఇచ్చినట్లే కనిపిస్తుంది.
బాలీవుడ్ బ్యూటీ షామా సికిందర్ వెండి తెరపై కనిపించి ఐదేళ్లు గడుస్తుంది. దాదాపు అమ్మడు ఇండస్ట్రీకి రిటైర్మెంట్ ఇచ్చినట్లే కనిపిస్తుంది. సినిమాలతో పాటు ఓటీటీ ప్లాట్ ఫాం కూడా ఎక్కడా కనిపించలేదు. నవతరం బ్యూటీల పోటీని తట్టుకుని అవకాశాలు అందుకోవడంలో చివరి స్థానంలోనే కొన సాగుతుంది. అయితే అమ్మడు క్రేజ్ ఏం తగ్గలేదు అంటే? ఇన్ స్టాక్వీన్ గా వెలిగిపోవడంతోనే సాధ్య మన్నది కాదనలేని నిజం.
సినిమాలు...వెబ్ సిరీస్ లతో సంబంధం లేకుండా ఒక్క ఇన్ స్టాలో పాపులర్ బ్యూటీగా వెలిగిపోతుంది. ఎప్పటి కప్పుడు కొత్త కొత్త ఫోటోలతో కాకలు పుట్టిస్తుంది. ఈ విషయంలో అమ్మడు నవతరం భామలకు గట్టి పోటినిస్తుంది. తాజాగా మరోసారి సీ బ్యూటీ ముందు చెర్రీ పండులా మెరిసింది. ఇదిగో ఇక్కడిలా బీచ్ రిసార్స్ట్ లో సేద తిరుతుంది.
రెడ్ కలర్ బికినీ దుస్తుల్లో సొగసనైన భంగిమలతో ఆకర్షిస్తుంది. కళ్ల ముందు అందమైన సముద్రం.. ..టేబుల్ పై ప్రూట్స్, సలాడ్, వైన్ గ్లాస్ తో వావ్ అనిపిస్తుంది. అలా సిప్ చేస్తూ బీచ్ వ్యూని ఆస్వాదిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. సికిందర్ బ్యూటీ నుంచి ఇలాంటి ఎలివేషన్లు పరిపాటే.
ఈ ఫోటోలు గ్లామర్ ప్రియుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి ఆస్వాదన నిత్యం నెటి జనులకు అంది స్తూనే అమ్మడు సంపాదిస్తుంది. ఇన్ స్టా క్రేజ్ తో లక్షలు ఆర్జిస్తుంది. మరి కెరీర్ పరంగా కొత్త ప్రయత్నాలు ఏవైనా చేస్తుందా? ఇదే తీరున కొత్త ఏడాదిలోనూ కంటున్యూ అవుతుందా? అన్నది చూడాలి.