పాన్ ఇండియాలో రిలీజ్ చేయకుండా తప్పు చేసారా?
సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన బాయల్య-బాబి సినిమా `డాకు మహారాజ్` మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. యధా విధిగా బాబి మార్క్ మాస్ హిట్ గా నిలిచింది.
సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన బాయల్య-బాబి సినిమా `డాకు మహారాజ్` మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. యధా విధిగా బాబి మార్క్ మాస్ హిట్ గా నిలిచింది. బాలయ్య ఇమేజ్ ని బేస్ చేసుకుని అతన్ని ఎలా చూపించాలో? వంద శాతం చూపించాడు. అందుకే బాబితో మరో సినిమా కూడా ఉంటుందని బాలయ్య ప్రకటించారు. అది ఎప్పుడు ఉంటుందన్నది తెలియదు గానీ, ఎప్పుడైనా ఉండొచ్చు.
థియేట్రి కల్ గా ఈసినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పటికే రామ్ చరణ్ `గేమ్ ఛేంజర్` డిజాస్టర్ అవ్వడం..రెండు రోజుల గ్యాపులో డాకు రిలీజ్ అవ్వడం అన్నది బాలయ్యకి కలిసొచ్చింది. చివరికి చరణ్ అభిమానులు కూడా బాలయ్య వైపు తిరిగారు. వికీ సమాచారం ప్రకారం ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లు అయితే వసూళ్లు 110 కోట్లు. అయితే ఈ సినిమా రెండు రోజుల క్రితమే ఓటీటీ నెట్ ప్లిక్స్ లో రిలీజ్ అయింది.
అక్కడ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగు వాళ్ల కంటే ఇతర భాషలకు చెందిన వారు ఈ సినిమాని అదరిస్తున్నారట. నెట్ ప్లిక్స్ లో అన్ని కంటెంట్లను వెనక్కి నెట్టేసి డాకు మహారాజ్ నెంబర్ వన్ గా స్ట్రీమింగ్ అవుతుందంటున్నారు. ఇతర భాషలకు చెందిన బాలయ్య అభిమానులంతా ఎగబడి చూస్తున్నా రంటున్నారు. అలాగే ఈ సినిమా పై ప్రేమతో కూడిన విమర్శలు కూడా చేస్తున్నారుట.
డాకు లో ఉన్న కంటెంట్ కి సినిమా ఇంకా పెద్ద సక్సెస్ అయ్యేదని...సినిమా జనాలకు రీచ్ అయ్యేలా రిలీజ్ కు ముందు సరిగ్గా ప్రమోషన్ చేయలేదని అంటున్నారు. భారీ ఎత్తున ప్రమోట్ చేసి ఉంటే? అతి భారీ వసూళ్లు సాధించే చిత్రమయ్యేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సినిమాని నిర్మాతలు పాన్ ఇండియాలో ఎందుకు రిలీజ్ చేయలేదు? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.