లాక్ డౌన్ లో చేసిన తప్పుల్ని తెలుసుకుందట.. ఇక అలా చేయదట

Update: 2021-06-22 03:30 GMT
మిగిలిన హీరోయిన్లకు భిన్నంగా.. హుషారెక్కించే చూపులతో.. చలాకీతనంతో కుర్రాకారు గుండెల్లో కిరాకు పుట్టించే డ్రీమ్ గర్ల్ హెబ్బాపటేల్. ఆరంభంలో అమ్మడు నటించిన కుమారి 21 ఎఫ్ దెబ్బకు ఒక్కసారిగా హాట్ భామగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకుంది. తొలి సినిమాలోనే అందంతో పాటు నటనతోనూ అదరగొట్టేసిన ఈ కుర్రభామ.. తర్వాత కాలంలో సినిమాల్ని ఎంపిక చేసుకోవటంలో తప్పటడుగులు వేసింది.

దీంతో.. మూడు నాలుగు సినిమాలకే కనిపించకుండా పోయినప్పటికీ.. భీష్మ.. రెడ్ చిత్రాల్లో తళుక్కున మెరిసి.. తానింకా రేసులో ఉన్నానన్నసంకేతాల్ని ఇచ్చింది. తాజాగా నాలుగు సినిమాల్ని చేతులో పెట్టుకున్నన ఈ భామ.. భవిష్యత్తు అంతా బాగుంటుందన్న ధీమాతో ఉంది. లాక్ డౌన్ కారణంగా మిగిలిన వారెలా ఉన్నప్పటికీ.. హెబ్బా మాత్రం.. కెరీర్ విషయంలో తాను చేసిన తప్పుల గురించి రివ్యూ చేసుకున్నట్లు చెప్పింది.

గతంలో తాను తప్పులు చేశానని.. ఈ కారణంతోనే తాను రేసులో వెనుకబడినట్లుగా చెప్పింది. లాక్ డౌన్ లో దొరికిన ఖాళీతో తన గురించి తాను ఆలోచించుకున్నానని.. కథల ఎంపిక విషయంలోనూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. ఫ్యూచర్ అంతా బాగుంటుందన్న పాజిటివ్ తో ఉన్న హెబ్బా.. తాను అనుకున్నట్లు దూసుకెళుతుందా? లేదా? అన్నది కాలమే డిసైడ్ చేయాలి.
Tags:    

Similar News