ఎవరిది తప్పయినా.. ఆ పిల్ల రాదు మేడం

Update: 2015-07-08 17:30 GMT
నిన్నగాక మొన్న డ్రీమ్‌గాళ్‌ హేమమాలిని కార్‌ యాక్సిడెంట్‌లో గాయాల పాలైన సంగతి తెలిసిందే. హేమమాలిని ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. అయితే ఈ యాక్సిడెంటులో ఓ రెండేళ్ల చిన్నారి మరణంపై ఇంటా బైటా తీవ్రంగా విమర్శలెదుర్కొన్నారు. హేమమాలిని కార్‌ డ్రైవర్‌ శరవేగంగా కార్‌ నడపడం వల్లే ఈ యాక్సిడెంట్‌ అయ్యిందని, అలాగే యాక్సిడెంట్‌ జరిగి ఆస్పత్రిలో చేరాక అవతలి వారి క్షేమం గురించి కనీసమాత్రంగానైనా పట్టించుకోకపోవడంపైనా పబ్లిక్‌ నుంచి సూటిగా విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.

అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌కి పూర్తి ఆపోజిట్‌గా మాట్లాడి మరోసారి విమర్శల పాలయ్యారు డ్రీమ్‌గాళ్‌. అవతలి వ్యక్తి కార్‌ని రూల్స్‌ మీరకుండా నడిపించి ఉంటే ఈ యాక్సిడెంట్‌ అయ్యి ఉండేది కాదు. ఆ చిన్నారి ప్రాణాలు పోయేవి కావు.. అంటూ ఆస్పత్రిలో కోలుకుంటున్న హేమమాలిని వ్యాఖ్యానించారు. ఆ చిన్నారి తండ్రి కార్‌ని సరిగా నడిపించకపోవడం వల్లే ఈ యాక్సిడెంట్‌ అంటూ తీవ్రంగా విమర్శించింది. దీనిపై అవతలి వ్యక్తిని ప్రశ్నించగా.. ఇలాంటి అభియోగం తగదు. అంత జరిగాక కనీసమాత్రంగా ఎంక్వయిరీ చేయనివాళ్లు మీరు మాట్లాడతారా? పోయిన నా కూతురిని తిరిగి తెచ్చివ్వగలరా? అంటూ వాపోయాడు. నిజమే కదా హేమాజీ.. తప్పు ఎవరిదైనా పోయిన ఆ పసిపాప నవ్వులు తిరిగొస్తాయా?

Tags:    

Similar News