ఛిల్ మోడ్ లో కామ్రేడ్ విజయ్

Update: 2018-12-17 15:10 GMT
ఈ ఏడాది సోలో హీరోగా కేవలం నాలుగు నెలల్లో మూడు సినిమాలతో పలరించిన విజయ్ దేవరకొండ వరస షూటింగులతో యమా బిజీగా ఉన్నాడు. ఇప్పటికిప్పుడు ఎంత పెద్ద నిర్మాత అడిగినా డేట్స్ ఇచ్చే పరిస్థితిలో లేడంటేనే అర్థం చేసుకోవచ్చు మనోడి డైరీ ఎంత బిజీగా ఉందొ. గీత గోవిందం-నోటా-టాక్సీవాలాల్లో ఒకటి బ్లాక్ బస్టర్ మరొకటి సూపర్ హిట్ అందుకుని నోటా డిజాస్టర్ అయినా దాని ప్రభావం లేకుండా తప్పించుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ కు అంకితమైపోయాడు.

 డెబ్యూ డైరెక్టర్ భరత్ కమ్మ రూపొందిస్తున్న ఈ మూవీ షూటింగ్ రెగ్యులర్ గా కాకినాడలో జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ పైథాయ్ తుఫాను చేస్తున్న అల్లకల్లోలం విజయ్ షూటింగ్ మీద కూడా పడింది. వాతావరణం అనుకూలించకపోవడంతో పాటు అక్కడి సజావుగా చేసుకునే పరిస్థితులు లేకపోవడంతో షూట్ కాన్సల్ చేసారు. దీంతో అనుకోకుండా దొరికిన బ్రేక్ తో విజయ్ దేవరకొండ ఛిల్ మోడ్ లోకి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటున్నాడు. దీనికి సంబంధించిన పిక్ పోస్ట్ చేస్తూ ఊహించినట్టే మేఘాలు ఉరిమినందుకు ఇలా రిలాక్స్ అవుతున్నామని చెప్పుకొచ్చాడు. తిరిగి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పలేదు.

కానీ తుఫాను ఈ రెండు రోజుల్లో కొలిక్కి వచ్చే సమాచారం ఉండటంతో ఎక్కువ గ్యాప్ ఉండకపోవచ్చు. డియర్ కామ్రేడ్ తో పాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత చేయబోయే వాటి గురించి ఎక్కువ డీటెయిల్స్ బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఈ ఏడాది మహానటితో కలిపి నాలుగు సినిమాలు వచ్చాయి కానీ వచ్చే సంవత్సరం మాత్రం రెండు లేదా మూడు కంటే ఎక్కువ ఛాన్స్ లేదని విజయ్ కాంపౌండ్ టాక్.
Tags:    

Similar News