బాలీవుడ్ బ్యూటీ దిషా పఠానీ, నటుడు టైగర్ ష్రాఫ్ ఇద్దరూ బుధవారం ముంబై రోడ్లపై జర్నీ చేశారు. అయితే.. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకుగానూ వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సరైన కారణం లేకుండా బయటకు వచ్చినందుకు ఎఫ్ ఐఆర్ నమోదు చేసినట్టు ముంబై పోలీసులు వెల్లడించారు.
ఈ విషయం బయటకు రావడంతో నెటిజన్లు ఈ లవ్ బర్డ్స్ ను టార్గెట్ చేశారు. కరోనా విజృంభిస్తున్న వేళ.. లాక్ డౌన్ రూల్స్ ను ఖాతరు చేయకుండా రోడ్లమీద చక్కర్లు కొట్టడమేంటని ప్రశ్నించారు. కొందరు వెటకారంగా సెటైర్లు వేశారు. ఈ పరిస్థితి శృతిమించడంతో.. టైగర్ ష్రాఫ్ తల్లి ఆయేషా ఘాటుగా స్పందించారు.
ఇలాంటి సమయంలో ఎవరూ బయట చక్కర్లు కొట్టడానికి వెళ్లరని, ఏదైనా మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకోండి అని ఆగ్రహం వ్యక్తంచేశారు. వీరిద్దరూ కారులో తిరిగివస్తుండగా.. పోలీసులు అడ్డుకొని ఆధార్ కార్డులు చూపించాలని అడిగారని చెప్పారు ఆయేషా.
''టైగర్ ష్రాఫ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఉచిత బోజనం అందించిన విషయం గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. కానీ.. అతడి ప్రతిష్టను దెబ్బతీసేందుకు మాత్రం సిద్ధంగా ఉంటారు. అయినా.. అత్యవసర సమయంలో బయటకు వెళ్లేంఉకు అనుమతి ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి'' అని అన్నారు.