పవన్ కల్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' తెలుగు రీమేక్ ఒకటి. ఇందులో ఆయనతో పాటుగా దగ్గుబాటి రానా స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. 'వకీల్ సాబ్' చిత్రానికి సంగీతం సమకూర్చిన థమన్.. ఇప్పుడు 'ఏకే' రీమేక్ కు కూడా మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ తో ఓ పాట పాదించబోతున్నట్లు ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ తాను నటించిన కొన్ని సినిమాల్లో తనదైన శైలిలో జానపద గేయాలు పాడి అదరగొట్టారు. 'తమ్ముడు' 'ఖుషి' 'గుడుంబా శంకర్' 'జానీ' 'అత్తారింటికి దారేది' 'అజ్ఞాతవాసి' వంటి చిత్రాలలో పాటలు పాడి అభిమానులను అలరించారు. ఈ క్రమంలో ఇప్పుడు #PSPKRana కోసం పవన్ మరోసారి తన గొంతు సవరించుకుంటున్నారు. మలయాళ వర్షన్ లో అక్కడి నేటివిటీకి తగ్గట్టుగా ఓ ఫోక్ సాంగ్ ఉంటుంది. ఇప్పుడు అదే గీతాన్ని పవన్ తో పాడిస్తున్నారా లేదా మరేదైనా పాటా అనేది తెలియాల్సి ఉంది.
ఏదేమైనా పవన్ ఓ సాంగ్ ఆలపించబోతున్నట్లు థమన్ చెప్పడంతో ఈ చిత్రంపై మరింత క్రేజ్ ఏర్పడింది. పవన్ పాడబోయే ఆ పాట ఎలా ఉంటుందో తెలియలాంటే ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే. కాగా, సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే నలభై శాతానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాని త్వరలోనే తిరిగి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.