లస్ట్ స్టోరీస్ కామెడీలోకి హృతిక్ ను లాగారు!

Update: 2018-08-16 06:44 GMT
సినిమాలతో పాటు మా ఆర్టికల్స్ కి కూడా సర్టిఫికేషన్లు ఉంటే దీనికి తప్పనిసరిగా 'ఎ' ఇవ్వాలి. ఏం చేస్తాం రాయక ఛస్తామా.. లోకం అలా ఉంది. కళ్ళు మూసుకుని అంతా సంప్రదాయం... కల్చర్.. ట్రెడిషన్ అని పిచ్చి మాటలు మాట్లాడుతూ కూర్చుంటే ఉన్న ఆ ఒక్క గోచీ కూడా లాగేస్తారు జనాలు.

సరే.. డైరెక్ట్  గా పాయింట్ లోకి వెళ్దాం.  నెట్ ఫ్లిక్స్ లో 'లస్ట్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్ వస్తోంది కదా. దీన్లో ఆడవాళ్ళ తీరని కోరికలు - సెక్సువాలిటీ - తీర్చుకునే పద్దతులు ఇంకా ఇలాంటి చాలా విలువైన సమాచారం మొహమాటం లేకుండా చర్చించారు.. చూపించారు. ఈ సీరీస్ నుండి ఒక ఈమధ్య ఒక క్లిప్ వైరల్ అయింది. అందులో "కల్  హమారే బీచ్ మె జో కుచ్ భీ హువా ఓ కన్సెన్సువల్ థీ.. మై తేజస్ హు"(నిన్న రాత్రి మనిద్దరి మధ్య ఏదైతే జరిగిందో అంది పరస్పర అంగీకారం తో జరిగింది. నేను తేజస్ ని). 

ఈ క్లిప్ ని చూపించి సుముఖి అనే ఒక స్టాండప్ కమెడియన్ హృతిక్ పేరు తలుచుకుంటూ ఎలా ఒక మహిళ స్యయంతృప్తి పొందాలో చెప్పింది. "ఇంటికెళ్ళండి - సెక్సీ మ్యూజిక్ ఆన్ చెయ్యండి - తలుపులు ముయ్యండి - చేతులు శుభ్రంగా కడుక్కోండి పరిశుభ్రత ముఖ్యం కదా - అప్పుడు హృతిక్ ని తలుచుకోండి.. అంతే పని అయిపోతుంది." 

ఈ మాస్టర్బేషన్ టిప్ వీడియో ను మిస్. మాలిని అనే ఒక సెలబ్రిటీ హృతిక్ కు ట్వీట్ చేసి 'హృతిక్ .. ఇది చూశారా' అని అడిగింది.  దానికి సమాధానం గా హృతిక్ "అవును.  నేను చూశాను.  దాదాపు నాకు ఇబ్బందికరంగానే ఉంది కానీ అదే సమయంలో నాకో కాంప్లిమెంట్ లా అనిపించింది." అన్నాడు.  ఏంటో.. ఈ బాలీవుడ్డోళ్ళు బాగా ముదుర్లప్పా!



Tags:    

Similar News