సూపర్ స్టార్ మహేష్ - వంశీ పైడిపల్లి కాంబినేషన్ మూవీ `మహర్షి` మే9న అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక మే 1న జరగనుంది. ఇదే వేదికపై ట్రైలర్ ని ఆవిష్కరించేందుకు ప్లాన్ చేశారని తెలుస్తోంది. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం భారీగా ఏర్పాట్లు సాగుతున్నాయి.
టాలీవుడ్ లో టిల్ డేట్ బెస్ట్ ఈవెంట్ గా నిర్వహించేందుకు టీమ్ ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. నెవ్వర్ బిఫోర్ అన్న తీరుగా.. ఇప్పటికే భారీ స్టేజ్ ఏర్పాట్లు చేశారు. `భరత్ అనే నేను` తర్వాత ఏడాది పాటు అభిమానులు ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్న తరుణమిది. ఈ ఈవెంట్ కోసం ఏపీ- నైజాం నుంచి భారీగానే మహేష్ అభిమానులు తరలి వస్తున్నారని చెబుతున్నారు. పీపుల్స్ ప్లాజాలో అందుకు తగ్గట్టే ప్రొటెక్టివ్ గా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవెంట్ రోజున భారీగా పోలీస్ సెక్యూరిటీ ఉంటుందిట.
ఇక ఈ ఈవెంట్ నిర్వాహకులు సామాజిక మాధ్యమాల్లో `మహర్షి` స్టేజ్ ఏర్పాట్లకు సంబంధించిన వీడియోని తాజాగా అభిమానుల కోసం రివీల్ చేశారు. #SSMB25 # మహర్షి #TFI గ్రాండ్ ప్రీరిలీజ్ ఇది. బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్గెస్ట్. ఇదిగో స్నీక్ పీక్! అంటూ ఓ వీడియోని ట్విట్టర్ లో షేర్ చేశారు. వేదిక ఆద్యంతం అల్ట్రా మోడ్రన్ లైటింగ్ సిస్టమ్ తో ఎల్ ఈడీ స్క్రీన్ తో ఆకట్టుకుంటోంది. ఇకపోతే ఇప్పటికే మహర్షి ఆల్బమ్ నుంచి ఐదు పాటలు రిలీజయ్యాయి. నేటి సాయంత్రం 4 గం.లకు `ఫిర్ షురూ ...` అంటూ సాగే పాట రిలీజ్ కానుంది. ఇప్పటివరకూ రిలీజైన అన్ని పాటలు సోసోనే అన్న విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దేవీశ్రీ మ్యూజిక్ పై అభిమానులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహర్షి ఈవెంట్ సినిమాకి కావాల్సిన బూస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. కనీసం ట్రైలర్ తో అయినా సినిమాపై ఉత్సాహం రెట్టింపయ్యేలా లేపుతారా? అంటూ సోషల్ మీడియాలోనూ డిబేట్ రన్ అవుతోంది. అందుకే ట్రైలర్ డే.. `మహర్షి`కి డిసైడింగ్ డే అన్న ముచ్చటా వేడెక్కిస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ కెరీర్ లో ఎన్నో రికార్డ్ బ్రేకింగ్ సినిమాలు ఉన్నాయి. మ్యూజిక్ పరంగా చార్ట్ బస్టర్స్ ఉన్నాయి. కానీ `మహర్షి` మాత్రం ఆడియో పరంగా చార్ట్ బస్టర్లను ఇవ్వడంలో వెనకబడింది. ఇక బాక్సాఫీస్ రికార్డుల పరంగా చూస్తే.. పోకిరి తర్వాత మహేష్ కెరీర్ లో దూకుడు కీలక మలుపునిచ్చిన బ్లాక్ బస్టర్. మహేష్ కెరీర్ 16వ సినిమాగా వచ్చిన దూకుడు రికార్డ్ బ్రేకింగ్ మూవీ. ఆడియో పరంగానూ చార్ట్ బస్టర్స్ ఉన్నాయి. మహర్షి మళ్లీ అంత వేవ్ చూపిస్తుందా? అన్న చర్చా సాగుతోంది. అందుకు తగ్గ కంటెంట్ సినిమాలో ఉందో లేదో తేలాల్సి ఉంది. ట్రైలర్ తో చాలావరకూ క్లారిటీ వస్తుందనే భావిస్తున్నారంతా.