గోపీచంద్ కథానాయకుడిగా 'సీటీమార్' సినిమా రూపొందింది. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏప్రిల్ 2వ తేదీన విడుదల చేయనున్నారు. గోపీచంద్ కబడ్డీ కోచ్ గా ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఆయన సరసన నాయికగా తమన్నా మెరవనుంది. క్రీడలు .. వాటిని నీలినీడల్లా కమ్ముకున్న రాజకీయాల చుట్టూ ఈ కథ తిరుగుతుందట. అలాంటి ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించాడు. ఆయన స్వరపరిచిన హాటు హాటు ఐటమ్ సాంగ్ ఒకటి దుమ్మురేపేయనుందని అంటున్నారు.
ఈ ఐటమ్ సాంగులో 'అప్సరరాణి' సందడి చేయనుంది. 'క్రాక్' సినిమాలోని ఐటమ్ సాంగ్ జనంలోకి ఒక రేంజ్ లో దూసుకెళ్లడంతో అప్సర క్రేజ్ పెరిగిపోయింది. ఐటమ్ సాంగ్ అంటేనే ముందుగా అప్సర పేరును పరిశీలిస్తున్నారు. అలాంటి ఆమెతో సంపత్ నంది ఒక రసవత్తరమైన ఐటమ్ సాంగ్ చేయించాడని చెప్పుకుంటున్నారు. ఈ సాంగ్ మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేస్తుందని అంటున్నారు. సంపత్ నందికి మాస్ పల్స్ బాగా తెలుసు .. అందువలన ఆయన వాళ్లకి కావలసినంత మసాలాను జోడించి సిద్ధం చేశాడని చెబుతున్నారు. 'క్రాక్' తరువాత అప్సరకి మంచి క్రేజ్ తీసుకొచ్చే ఐటమ్ ఇదే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో సంపత్ నంది - గోపీచంద్ కాంబినేషన్లో వచ్చిన 'గౌతమ్ నంద' అంతగా ఆకట్టుకోలేదు. దాంతో ఈ సినిమాతో తప్పకుండా హిట్టు కొట్టాలనే పట్టుదలతో ఇద్దరూ ఉన్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. రావు రమేశ్ పాత్ర చాలా విలక్షణంగా ఉంటుందనీ, ఆయన కెరియర్లో చెప్పుకోదగిన పాత్రల్లో ఇది ఒకటి అవుతుందని అంటున్నారు. ఇక భూమిక పాత్ర కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. చాలా కాలంగా హిట్ కోసం వెయిట్ చేస్తున్న గోపీచంద్ కు, ఈ సినిమాతో ఆ ముచ్చట తీరుతుందేమో చూడాలి.