అవార్డుల కోసం లాబీయింగ్ పై దర్శకుడి తూటా

Update: 2016-12-25 07:30 GMT
కరణ్ జోహార్ అటు దర్శకుడిగానే కాదు.. ఇటు నిర్మాతగానూ బోలెడన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. అలాగే పలు అవార్డులు కూడా ఈయనకు  సొంతం అయ్యాయి. తాజాగా ఈయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ టిపికల్ క్వశ్చన్ ఎదురైంది.

జియో ఫిలింఫేర్ అవార్డ్స్62..  సందర్భంగా 'అవార్డుల కోసం మీరు లాబీయింగ్ చేస్తారా' అంటూ అడిగిన ప్రశ్న కరణ్ జోహార్ ను ఆలోచనలో పడేసింది. కొన్ని సెకన్లపాటు సైలెంట్ గా ఉన్న కరణ్.. ఆ తర్వాత స్మూత్ గానే కాస్త వయొలెంట్ ఆన్సర్ ఇచ్చాడు. 'నేను ఇప్పటివరకూ అవార్డుల కోసం ఎవరినీ పిలవలేదు.. ఎవరితోనూ మాట్లాడలేదు. ఆ అవసరమే లేదు. నా కెరీర్ లో నేను చాలా తక్కువ అవార్డులు గెలుచుకున్నా. అవి కూడా గ్లామర్ కి సంబంధించిన. దర్శకుడిగా నాకు ఇప్పటివరకూ వచ్చినవి రెండే అవార్డులు' అని చెప్పాడు కరణ్ జోహార్.

'తమ సినిమాలపై నమ్మకం ఉన్నవారు.. అవార్డుల కోసం ఎవరితోనో మాట్లాడి.. లాబీయింగ్ చేయాలని అనుకోరు. అవి తమకు దక్కుతాయనే వారిలో పుష్కలంగా ఉంటుంది' అని చెప్పాడు ఈ దర్శకుడు. జనవరి 14.. 2017న ఈ ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News