నేను ప్రేక్షకులను నవ్వించాను.. వారు నన్ను మోసం చేసిపోయారుః రాజేంద్ర ప్రసాద్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజేంద్ర ప్రసాద్ శైలే వేరు. కామెడీ హీరోగా ఆయన చేసిన పాత్రలు నెవ్వర్ బిఫోర్ అనడమే కాదు.. ఎవర్ ఆఫ్టర్ అని కూడా చెప్పొచ్చు. అంతలా.. తనదైన నటన, మేనరిజంతో ఆకట్టుకున్నారు. ఇప్పటికీ.. తనదైన పెర్ ఫర్మార్మెన్స్ తో అదరగొడుతున్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. తన జీవితంలో బాధాకరమైన సంఘటనలు ఏమైనా ఉన్నాయంటే.. తనవాళ్లు మోసం చేయడమేనని వెల్లడించారు.
ఆయన ప్రధాన పాత్రలో నటించిన 'క్లైమాక్స్' మూవీ ఈ శుక్రవారం విడుదలైంది. ఈ నేపథ్యంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా తన జీవితం గురించి కూడా వివరించారు రాజేందప్రసాద్. తాను దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని, ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి ముందు మద్రాసు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో శిక్షణ తీసుకున్నానని తెలిపారు.
అయితే.. అప్పటికే పెద్ద పెద్ద హీరోలు ఉండడంతో.. ఇండస్ట్రీలో రాణించాలంటే ఎలా అని ఆలోచించేవాణ్నని తెలిపారు. ఓ సారి చార్లి చాప్లిన్ సినిమా చూస్తూ.. కామెడీ సినిమాలతోనే ప్రేక్షకులను అలరించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు రాజేంద్ర ప్రసాద్.
అయితే.. తాను జీవితంలో సొంత వారి వద్దే మోసపోయానని తెలిపారు. ప్రధానంగా డబ్బు విషయంలో ఎక్కువగా దెబ్బతిన్నానని చెప్పారు. తాను సంపాదించిన డబ్బులన్నీ ఏమైపోయాయని చూసుకుంటే.. వాళ్లు మోసం చేసి వెళ్లిపోయిన విషయం అర్థమైందని వెల్లడించారు రాజేంద్ర ప్రసాద్.