ఇది ఎవరో మాట్లాడుకుంటే తెలుసుకున్న సమాచారం కాదు. స్వయంగా బాలయ్య నోటి నుంచే వచ్చిన మాట. ఆయన రోజూ ఒక చుట్ట కాలుస్తాడట. గొంతు బాగుండటానికి, ఆరోగ్యం కోసమే ఈ పని చేస్తానని బాలయ్య సెలవివ్వడం విశేషం. ఎందుకీ ప్రస్తావన తెచ్చాడో ఏంటో కానీ.. ఈ మధ్య ఓ ఫంక్షన్లో వేదిక ఎక్కి ఈ చుట్ట సంగతి చెప్పాడు బాలయ్య. ‘‘అవును నేను రోజూ ఓ చుట్ట కాలుస్తాను. అలా చేస్తే గొంతు బాగుంటుంది. ఆరోగ్యం కోసమే ఇలా చేస్తున్నా. నేనేంటి చుట్ట కాల్చడమేంటి అని చాలామంది అడుగుతుంటారు. వాళ్లందరికీ పొగతాగని వాడు తర్వాతి జన్మలో దున్నపోతై పుడతాడన్న పద్యం తెలియదనుకుంటా’’ అని చెప్పాడు బాలయ్య.
పొగ తాగడంపై నిషేధం విధించడం వల్లే దశరథుడు పుత్రుణ్ని దూరం చేసుకోవాల్సి వచ్చిందని.. శ్రీకృష్ణుడు జరాసంధుడిని దూరం చేసుకోవడానికి.. పాండు రాజుకు పాండు రోగం రావడానికి.. ధ్రుత రాష్ట్రుడు కళ్లు పోగొట్టుకోవడానికి పొగ తాగకపోవడమో, దానికి వ్యతిరేకంగా పని చేయడమో కారణమని పద్యరూపంలో సెలవిచ్చాడు బాలయ్య. ఓ పక్క పొగతాగడం ప్రమాదకరం అని వైద్యులు చెబుతూ.. ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే బాలయ్య ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉంది.