అలా బతకలేకపోతే ఎంత డ‌బ్బున్నా వేస్టే: విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Update: 2022-08-23 05:44 GMT
2011లోనే సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. 2016లో విడుద‌లైన 'పెళ్ళిచూపులు' మూవీతో ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్యాడు. 'అర్జున్ రెడ్డి'తో ఓవ‌ర్ నైట్ స్టార్ గా మారి టాలీవుడ్ రౌడీ బాయ్ గా గుర్తింపు పొందిన విజ‌య్ దేర‌కొండ.. మ‌రో రెండు రోజుల్లో 'లైగ‌ర్‌' సినిమాతో అల‌రించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇది ఆయ‌న కెరీర్ లోనే తొలి పాన్ ఇండియా చిత్రం.

ధర్మా ప్రొడెక్షన్స్‌, పూరీ కనెక్ట్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మైన ఈ చిత్రానికి డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే టాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది. ఆగ‌స్టు 25న ఈ చిత్రం అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతున్న నేప‌థ్యంలో మేక‌ర్స్ విసృతంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు.

ఇందులో భాగంగానే తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న హీరోయిన్ అన‌న్య పాండేతో క‌లిసి ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సంద‌ర్బంగా విజ‌య్‌, అన‌న్య‌లు ఎన్నో ఆస‌క్తిక‌ర‌ విష‌యాల‌ను పంచుకున్నారు. ఈ క్ర‌మంలోనే 'మీరు సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన వ్య‌క్తి కాదు, చిన్న పాత్ర‌ల నుంచి స్టార్ గా ఎదిగారు. అసలు విజయ్‌ దేవరకొండ అంటే ఎవరు..?' అనే ప్ర‌శ్న ఎదురైంది.

అందుకు విజ‌య్ దేవ‌కొండ బ‌దులిస్తూ.. 'నాకు పూర్తిగా నేనెవ‌రో తెలియ‌దు. కానీ, ఒక‌టి బాగా తెలుసు. నాకు అనిపించింది నేను మాట్లాడ‌తా, నాకు న‌చ్చిన‌ట్టు నేను ఉంటా. అదే నాకు అన్నిటికంటే ముఖ్య‌మైన‌ది. న‌చ్చిన‌ట్టు బ‌త‌క‌లేక‌పోతే సూపర్‌ స్టార్‌ అయినా, ఎంత డ‌బ్బు సంపాదించినా వేస్టే. అందుకే న‌చ్చిన‌ట్లు ఉండాలి, న‌చ్చింది చెప్పాలి. అది కొంచెం క‌ష్ట‌మైన‌దే. కానీ, అలా ఉంటున్నాను కాబ‌ట్టే ఇంత మంది న‌న్ను ప్రేమిస్తున్నార‌ని నేను న‌మ్ముతున్నా' అంటూ చెప్పుకొచ్చాడు.
 
అలాగే ఇటీవ‌ల ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పూరీ జగ‌న్నాథ్ మాట్లాడుతూ.. 'విజ‌య్ దేవ‌ర‌కొండకు రెమ్యున‌రేష‌న్ లో భాగంగా రూ. 2 కోట్లు పంపితే.. మొద‌ట అప్పులు తీర్చ‌మ‌ని వెన‌క్కి పంపేశాడు' అంటూ ఆయ‌న్ను ఆకాశానికి ఎత్తేశారు. అయితే తాజా ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యంపై కూడా ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. 'రూ. 2 కోట్లు ఇస్తే వెన‌క్కి పంపించేశారంట‌.. డబ్బులు బాగా సంపాదించేశారా..?' అని అడ‌గ‌గా.. అందుకు విజ‌య్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు.

'డ‌బ్బులు ఇక అవ‌స‌రం లేద‌నీ కాదు.. ఎక్కువ ఉన్నాయ‌నీ కాదు. కానీ, ఆ స్టేజ్‌లో తిన‌డానికి, ఈఎంఐలు క‌ట్ట‌డానికి, పెట్రోల్ కి డ‌బ్బులు స‌రిప‌డా ఉన్నాయి. ఆ టైమ్ లో నాకంత అవ‌స‌రం లేద‌నిపించింది. అప్ప‌టికే కోవిడ్ కార‌ణంగా ఇండ‌స్ట్రీలో మ‌నీ రొటేష‌న్ ఆగిపోయింది. అయినాస‌రే నాకు కొంత అమౌంట్ ను ఛార్మీ పంపింది. అయితే డ‌బ్బు కంటే ముఖ్య‌మైన‌ది సినిమా. నాకెలాగో ఆ స‌మ‌యంలో డ‌బ్బు అంత అవ‌స‌రం లేదు కాబ‌ట్టి.. త‌ర్వాత ఎప్పుడైనా తీసుకోవ‌చ్చు అని వెన‌క్కి పంపాను' అంటూ చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఈ రోజుల్లో కూడా డ‌బ్బు కంటా సినిమాకే విజ‌య్ ఎక్కువ ప్రాధాన్య‌త ఇవ్వ‌డం ప‌ట్ల నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.
Tags:    

Similar News