బాలయ్య పక్కన బక్క భామకి ఛాన్స్

Update: 2016-04-20 12:45 GMT
బాలయ్య సెంచరీ సినిమాకి సంబంధించిన ప్రతీ అప్ డేట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోతోంది. తన ల్యాండ్ మార్క్ మూవీగా విభిన్నమైన కథాంశంతో గౌతమీపుత్ర శాతకర్ణిని చేస్తున్నారు. క్రీస్తు శకం ఒకటి - రెండు శతాబ్దాలకు శాతవాహన చక్రవర్తి అయిన ఈ గౌతమీపుత్ర శాతకర్ణికి.. ఓ మహారాణి కావాలి కదా. ఆ రాజుగారి భార్య పేరు రాణీ నయనిక. ఇప్పుడీ పాత్ర కోసం ఎవరిని ఎంచుకుంటారనే ఇంట్రెస్ట్ నెలకొంది.

ఇప్పటికే పలు పేర్లు పరిశీలించినా.. ఇప్పుడు కొత్తగా బాలయ్య పక్కన రాణీగా నటించే రేస్ లోకి గోవా బ్యూటీ వచ్చి చేరింది. ఇలియానాను రాణి పాత్ర చేయించాలని భావిస్తున్నాడట దర్శకుడు క్రిష్. ఈ మూవీని అన్ని యాంగిల్స్ లోనూ అద్భుతంగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగానే.. ఇలియానాను ఆప్షన్ గా చేసుకున్నాడని అంటున్నారు. అయితే.. ఈ బక్కపలచని భామకి కేరక్టర్ ఇంకా కన్ఫాం కాలేదు. ఇంకా రేసులో కాజల్ అగర్వాల్ - నయనతారలు ఉన్నారు. రెండు సార్లు యువరాణిగా చేసిన కాజల్ - బాలయ్య పక్కన చేసిన అన్ని సినిమాలతోను హిట్ కొట్టిన నయనతారల ఆప్షన్స్ కూడా ఇంకా ఓపెన్ గానే ఉన్నాయి.

ఏప్రిల్ 22న సినిమా ప్రారంభం రోజున మిగిలిన డీటైల్స్ ప్రకటించనున్నారట. అయితే.. రాజమాత గౌతమి పాత్రకి మాత్రం అలనాటి బాలీవుడ్ నటి హేమామాలిని ని తీసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో అంగరంగవైభవంగా బాలయ్య వందో సినిమా ప్రారంభం కానుంది.

Tags:    

Similar News