బాల‌య్య ఫ్యాన్స్.. అపురూప కానుక రెడీ

Update: 2016-03-23 13:44 GMT
తెలుగులో తిరుగులేని మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో నంద‌మూరి బాల‌కృష్ణ ఒక‌రు. ఆయ‌న‌కున్న అభిమాన గ‌ణం గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. యువ క‌థానాయ‌కులతో పోటీ ప‌డుతూ ఇప్ప‌టికీ త‌న ఫ్యాన్ ఫాలోయింగ్ కాపాడుకుంటూ త‌న ప్ర‌త్యేక‌తను చాటుకుంటున్నాడు నంద‌మూరి క‌థానాయ‌కుడు. న‌టుడిగానే కాక రాజ‌కీయ నాయ‌కుడిగానూ త‌న‌దైన ముద్ర వేస్తున్న బాల‌య్య మీద ఇండియాటుడే మ్యాగజైన్ ఓ ప్ర‌త్యేక సంచిక‌ను సిద్ధం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ ఎడిష‌న్ రెడీ అయిపోయింది. ఈ రోజే ముఖ‌చిత్రం బ‌య‌టికి వ‌చ్చేసింది. త్వ‌ర‌లోనే మార్కెట్ లోకి రాబోతున్న ఈ ఎడిష‌న్ ధ‌ర‌ను 40 రూపాయ‌లుగా నిర్ణ‌యించారు.

లెజెండ్ సినిమాలోని బాల‌య్య గెట‌ప్పుల‌తో ముఖ‌చిత్రాన్ని డిజైన్ చేశారు.నంద‌మూరి బాల‌కృష్ణ.. ది లెజెండ్ అనే టైటిల్ పెట్టి.. త‌న‌త‌రం హీరోల్లో ఏకైక ఆల్ రౌండ‌ర్‌.. తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా సినీ.. రాజ‌కీయ‌.. సేవా రంగాల్లో చ‌రిత్ర సృష్టిస్తున్న అనిత‌ర సాధ్యుడు అంటూ క్యాప్ష‌న్లు కూడా జోడించారు క‌వ‌ర్ పేజీ మీద‌. బాలయ్య 99 సినిమాలు పూర్తి చేసుకుని.. త్వరలోనే వందో సినిమా మైలురాయిని అందుకోబోతున్న నేపథ్యంలో ఇండియా టుడే ఈ బృహత్తర ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. అందులో బాలయ్య సినీ కెరీర్లోనే మైలురాళ్ల గురించి.. ఆయన పేరిట ఉన్న కలెక్షన్ల, సెంటర్ల రికార్డులతో పాటు కొన్ని స్పెషల్ మూవీస్ గురించి ప్రత్యేక కథనాలు వెలువరిస్తన్నారు. ఎన్టీఆర్ తో బాలయ్య అనుంబంధం గురించి.. బాలయ్య పొలిటికల్ కెరీర్ గురించి.. కూడా ఇందులో ప్రస్తావన ఉంటుంది.

ఇంతకుముందు టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - కింగ్ నాగార్జునల మీద ‘ఇండియా టుడే’ ఇలా స్పెషల్ ఎడిషన్లు తీసుకొచ్చింది. ప్ర‌స్తుతం ఇండియాటుడే తెలుగు మ్యాగ‌జైన్ మూత ప‌డ్డ‌ప్ప‌టికీ బాల‌య్య కోసం ఇలా స్పెష‌ల్ ఎడిష‌న్ తీసుకురావ‌డం విశేష‌మే. నంద‌మూరి అభిమానుల‌కు ఈ ఎడిష‌న్ ఓ అపురూప కానుక అన‌డంలో సందేహం లేదు. ధ‌ర రూ.40 మాత్ర‌మే కాబ‌ట్టి భారీగా అమ్మ‌కాలు జ‌రిగే అవ‌కాశ‌ముంది.
Tags:    

Similar News