డెబ్యూ మూవీ అల్లుడు శీనుతో మొదలుకుని మొన్న వచ్చిన కవచం దాకా అన్ని భారీ బడ్జెట్ సినిమాలే చేస్తూ వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రెండు సినిమాలు ఇంచుమించు ఒకే టైంలో షూటింగ్ పూర్తి చేసుకునే దశలో ఉన్నాయి . ఒకటి తేజ డైరెక్ట్ చేసిన సీత కాగా రెండోది రమేష్ వర్మ తీసిన తమిళ రీమేక్ రాక్షసుడు. ముందు వచ్చేది సీతనే అయినప్పటికీ ఆ టైంకంతా రాక్షసుడు కూడా ఫస్ట్ కాపీతో రెడీ అయ్యేలా ఉన్నాడు .
నిజానికి ఇప్పుడు మార్కెట్ లో ఈ రెండు సినిమాలకూ పెద్దగా డిమాండ్ లేదు. ఎప్పుడు వస్తాయా అన్న ఆత్రుత బయ్యర్లలో కాని ఇటు ప్రేక్షకుల్లో కాని లేదు. ఏదోలా మంచి రిలీజ్ దక్కించుకుంటే ఆ తర్వాత హిట్ టాక్ వస్తే అప్పుడు వసూళ్లు రావోచ్చనే ధీమా తప్ప ఇందులో ఇంకే పాజిటివ్ యాంగిల్ లేదు. దానికి తోడు ఇప్పటి దాకా ముప్పై నుంచి నలభై కోట్ల దాకా బడ్జెట్ లు మార్కెట్ లు చేసిన బెల్లం హీరో మీద అంత రిస్క్ చేయలేమని కవచం తర్వాత డిస్ట్రిబ్యూటర్లు స్పష్టం చేశారు
సో ఏది ముందు వచ్చినా సాలిడ్ గా హిట్ కావడం చాలా అవసరం. ఒకవేళ సీత రెస్పాన్స్ పాజిటివ్ గా ఉంటె అది తక్కువ బడ్జెట్ లో రూపొందిన రాక్షసుడికి ప్లస్ అవుతుంది. లేదూ ఏదైనా తేడా వచ్చిందా అప్పుడూ రిస్క్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే రాక్షసుడుని 15 కోట్ల లోపే పూర్తి చేశారుట. సో అంతకే అమ్మినా సమస్య ఉండదు. కాకపోతే సీత ఎంత బిజినెస్ చేస్తుంది అనేది కీలకంగా మారింది.
కేవలం తేజ బ్రాండ్ కు కోట్లు కుమ్మరించే సీన్ లేదు. కాజల్ అగర్వాల్ ను ఆకర్షణగా చూపుతున్నా తనొక్కతే ఈ భారాన్ని మోయలేదు. సో రీజనబుల్ రేట్లకే ఇవ్వక తప్పదు. ఈ రెండు సినిమాల ఫలితం సాయి శ్రీనివాస్ తదుపరి సినిమాల మార్కెట్ ను డిసైడ్ చేస్తుందన్న మాట వాస్తవం. సీతను మే 24 విడుదల చేసే ఆలోచనలో ఉంది టీం