చిరు కోరిక తీరినట్లేనా?

Update: 2022-10-06 14:30 GMT
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా విడుదలకు ముందు కొంత నెగిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ అయ్యాయి. అసలే మెగాస్టార్ రొటీన్ సినిమాలు చేస్తున్నారు అనే కామెంట్స్ అయితే చాలానే వచ్చాయి. దానికి తోడు రీమేక్ సినిమాలు అంటే ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపుకోవచ్చు అనే సందేహాలు చాలానే వచ్చాయి. కానీ దర్శకుడు మోహన్ రాజా లూసిఫర్ ను చేంజ్ చేసిన విధానం ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకుంది.

చాలా వరకు సన్నివేశాలలో అతను మెగాస్టార్ ను చాలా పవర్ఫుల్ గా చూపించాడు అని అర్థమైంది. ఒక విధంగా ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి కోరిక కూడా తీరింది అని చెప్పవచ్చు. ఏదేమైనా కలెక్షన్స్ ను పక్కన పెడితే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో మొదటి రోజు ఓ వర్గం ప్రేక్షకుల నుంచి అయితే పాజిటివ్ టాక్ అందుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోయిన్ డ్యూయెట్ సాంగ్స్ లేకుండా సినిమా చేసి సక్సెస్ కొట్టిన సందర్భాలు అయితే లేవు.

కె.విశ్వనాథ్ లాంటి దర్శకుడితో కూడా అప్పట్లో చేసిన ఆపద్బాంధవుడు సినిమా ఆయనను చాలా నిరాశకు గురి చేసింది. ఆ సినిమాకు అవార్డులు వచ్చినప్పటికీ కూడా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు అనే భావనతో కాస్త డిసప్పాయింట్ అయ్యాడు. అంతేకాకుండా డాడీ అనే సినిమా సమయంలో కూడా ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

అందులోనూ కమర్షియల్ అంశాలు వీరికించే ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయోగం సక్సెస్ కాలేదు. ఒక విధంగా చిరంజీవి అభిమానుల కారణంగా ఎంతగా సంతోషించారో అలాగే ఫ్యాన్స్ వల్లనే నిరాశపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఫ్యాన్స్ కోరిక మేరకు అలాగే ఒకే విధమైన రొటీన్ సినిమాలు చేస్తూ ఉండేసరికి ఆయనకు కూడా బోరింగ్ కొట్టేసింది.

ఇక ఈసారి గాడ్ ఫాదర్ సినిమా కరెక్ట్ అని రాంచరణ్ ఒప్పించి మరి సినిమా చేశారు. ఒక విధంగా లూసిఫర్ అనగానే మెగాస్టార్ కు ఏమాత్రం కరెక్ట్ కాదని అందరూ అనుకున్నారు.

కానీ దర్శకుడు తెలివితో ఈ సినిమా నుంచి న్యాయమైతే చేశాడు. సినిమా సక్సెస్ తో సంబంధం లేకుండా మెగాస్టార్ మాత్రం సంతృప్తి చెందే విధంగా గాడ్ ఫాదర్ రిజల్ట్ అందుకుంటుంది అని చెప్పవచ్చు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News