ఇటీవలి కాలంలో రీ-రిలీజులు మరియు స్పెషల్ షోలు అనేవి టాలీవుడ్ లో ట్రెండ్ గా మారిపోయాయి. గతంలో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన సినిమాలను.. క్లాసిక్ చిత్రాలను 4K రెజెల్యూషన్ లో మళ్ళీ థియేటర్లలో విడుదల చేస్తున్నారు. వీటికి అభిమానులు మరియు సాధారణ సినీ ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ లభిస్తోంది.
అప్పట్లో ఈ సినిమాలను థియేటర్లలో చూడలేకపోయిన ఆడియన్స్.. మరోసారి తమకు నచ్చిన చిత్రాలను చూడాలనుకునే ఫ్యాన్స్ బిగ్ స్క్రీన్ మీద బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగా మంచి కలెక్షన్స్ వస్తుండటంతో.. అందరూ రీరిలీజుల బాట పడుతున్నారు. ఒకరి తర్వాత మరొకరు ఈ ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు.
'పోకిరి' సినిమాని రీ రిలీజ్ చేయడంతో మొదలైన ట్రెండ్.. ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే హిట్టు సినిమాలను మళ్ళీ రిలీజ్ చేయడం వరకూ బాగానే ఉంది కానీ.. అదే పనిగా భారీ డిజాస్టర్లను ప్లాప్ చిత్రాలను కూడా తిరిగి థియేటర్లలో విడుదల చేయడమే వింత పోకడగా మారుతోందనే కామెంట్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే స్పెషల్ గా 'రెబల్' చిత్రాన్ని రీరిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచిన ఈ చిత్రాన్ని మళ్ళీ బిగ్ స్క్రీన్ మీదకు తీసుకొస్తే.. అభిమానులు సైతం ఆసక్తి కనబరచలేదు. ప్రధాన కేంద్రాలలలో ప్రదర్శించిన షోలు మినహా, మిగతా అన్ని థియేటర్లలో పెద్దగా జనం లేక వెలవెలబోయాయి.
అలానే ఆడియన్స్ రిజెక్ట్ చేసిన నితిన్ 'అడవి' సినిమాని మళ్ళీ విడుదల చేసారు. కానీ జనాలు ఈ కళాఖండాన్ని చూసే సాహసం చేయలేదు. ఈ క్రమంలో ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'బాబా' చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. దీని కోసం తలైవాని ఒప్పించి కొత్తగా డబ్బింగ్ చెప్పించారు.. ఏఆర్ రెహమాన్ తో స్పెషల్ గా సౌండ్ పర్యవేక్షణ చేయిస్తున్నారు.
నిజానికి 'బాబా' అనేది రజినీ కెరీర్ లో డిజాస్టర్ సినిమా. 2002లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ వల్ల డిస్ట్రిబ్యూటర్లు నష్టాల పాలయ్యారు. దీంతో రజినీ నైతిక బాధ్యత తీసుకొని బయ్యర్లకు కొంత మొత్తంలో సెటిల్ చేసారు. అలాంటి చిత్రాన్ని ఇప్పుడు మళ్ళీ థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్ మొదట్లోనే ఎదుర్కొన్న భారీ పరాజయం 'ఆరెంజ్' కూడా రీరిలీజ్ కాబోతోంది. ఈ సినిమా తెచ్చిపెట్టిన నష్టాల కారణంగా చనిపోవాలనుకున్నానని ఓ ఇంటర్వ్యూలో నిర్మాత నాగబాబు.. ఇప్పుడు టైం చూసి మళ్ళీ విడుదల చేస్తానని చెప్పారు.
అలానే పవన్ కళ్యాణ్ ప్లాప్ చిత్రాల జాబితాలో ఉన్న 'తీన్ మార్' ని రీరిలీజ్ చేయడానికి రెడీ అని నిర్మాత బండ్ల గణేష్ చెబుతున్నారు. ఇలా అనేక సూపర్ డూపర్ ఫ్లాప్ చిత్రాలు రాబోయే రోజుల్లో మళ్ళీ ప్రేక్షకులను పలకరించడానికి థియేటర్లలోకి వస్తున్నాయి. అయితే వీటిపై నార్మల్ ఆడియన్స్ నుంచి నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి.
తెలుగులో కల్ట్ క్లాసిక్స్ గా నిలిచిన పాత సినిమాలు మరియు గుర్తుండిపోయే విజయంతమైన చిత్రాలను మళ్ళీ రిలీజ్ చేసినా ఒక ప్రయోజనం ఉంటుంది కానీ.. ఇలా భారీ డిజాస్టర్లను తిరిగి థియేటర్లలోకి తీసుకొస్తే, మున్ముందు ఈ ట్రెండ్ నెగటివ్ గా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.