మాషూకా హిట్లా ఫ్లాపా! ర‌కుల్ ఎంత‌గా ట్రై చేసినా కానీ..!

Update: 2022-08-05 04:46 GMT
సోష‌ల్ మీడియా యుగంలో ప్ర‌చారం చాలా సులువు అయిపోయింది. సెల‌బ్రిటీ కావాలంటే దానికోసం ఎవ‌రినో ఆశ్ర‌యించాల్సిన ప‌ని లేదు. డిజిట‌ల్ యూట్యూబ్ అందుబాటులో ఉండ‌గా ఎవ‌రికి వారు త‌మ ప్ర‌తిభ‌ను క‌ళాతృష్ణ‌ను ప్ర‌ద‌ర్శించేందుకు మార్గం సుగుమం అయ్యింది. చాలా మంది సింగిల్స్ పేరుతో ఆల్బ‌మ్స్ రూపొందించి ఎవ‌రికి వారు యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్నారు. వీటికి వేలాది ల‌క్ష‌లాది లైక్ లు క్లిక్ లు వ‌స్తున్నాయి.

ఇక మెయిన్ స్ట్రీమ్ స్టార్స్ గా కొన‌సాగుతున్న‌ నోరా ఫ‌తేహి.. ర‌కుల్ ప్రీత్ .. లాంటి భామ‌లు సింగిల్ ఆల్బ‌మ్స్ తో ఇటీవ‌ల వెబ్ లో హాట్ టాపిక్ అయ్యారు. నోరా ఫ‌తేహి వెస్ట్ర‌న్ స్టైల్ సాంగ్ బంప‌ర్ హిట్ కొట్టింది. ఆ పాట‌కు నోరా వినియోగించిన కాస్ట్యూమ్స్ మేక‌ప్ స్టెప్స్ యూనిక్ అని టాక్ వ‌చ్చింది. ఇక నోరా శైలి నృత్యాల‌కు కుర్ర‌కారు యూట్యూబ్ లో ఇర‌గ‌బడి చూసారు. కానీ అంత హైప్ మాత్రం ర‌కుల్ ప్రీత్ సింగ్ మాషూకా..కి రాలేద‌న్న‌ది వాస్త‌వం.

అలాగే ఈ పాట‌లో ర‌కుల్ వెరీ రెగ్యుల‌ర్ ఔట్ ఫిట్స్ తో క‌నిపించింది. స్టెప్స్ ప‌రంగా ఏమంత కొత్త‌ద‌నం క‌నిపించ‌లేదు. మాషూకా హుక్ స్టెప్ పేరుతో ర‌కుల్ ఎంతగా ప్ర‌య‌త్నించినా త‌న‌లో ఎన‌ర్జీ మిస్స‌య్యింద‌ని కామెంట్లు కూడా వినిపించాయి.

అయినా ర‌కుల్ కి సోష‌ల్ మీడియాల్లో ఉన్న అసాధార‌ణ ఫాలోయింగ్ నేప‌థ్యంలో ఈ పాట‌కు కూడా ఫ‌ర్వాలేద‌నిపించే లైక్ లు క్లిక్ లు వ‌చ్చాయి. అయితే కాంపిటీష‌న్ లో ఇంత‌కంటే బెట‌ర్ గా ప్ర‌య‌త్నిస్తేనే ఎవ‌రికైనా ఆద‌ర‌ణ ద‌క్కుతుందని మాషూకా నిరూపించింద‌ని గుస‌గుస వినిపిస్తోంది.

ఇక మాషూకాని డిజిట‌ల్ య‌ట్యూబ్ లో హిట్ చేసేందుకు ర‌కుల్ చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. తాజాగా మాషూకా ప్ర‌చారంలో భాగంగా హుక్ స్టెప్ వీడియోని ర‌కుల్ ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ పాట‌ను ఆల‌పించిన ప్ర‌ముఖ గాయ‌నీమ‌ణి ఆశీష్ కౌర్ కూడా ర‌కుల్ తో  పాటు హుక్ స్టెప్ ని ప్ర‌య‌త్నించారు.

ఆశీష్ కౌర్ వాయిస్ ని మ్యాచ్ చేయాల‌ని నా డ్యాన్సుల‌తో ప్ర‌య‌త్నించినా కానీ ఆ ఎన‌ర్జీని మ్యాచ్ చేయ‌లేక‌పోయాన‌ని కూడా ర‌కుల్ అంగీక‌రిస్తోంది. నిజానికి ఎన‌ర్జీ లేనిదే డ్యాన్సింగ్ కి వెయిట్ ఉండ‌దు. అది గ‌మ‌నించాలి ర‌కుల్! అంటూ అభిమానులే చుర‌క‌లు వేస్తున్నారు. ఈ పాట‌కు ఆశీష్ కౌర్ హ‌స్కీ వాయిస్ కొంత‌వ‌ర‌కూ ప్ల‌స్. కానీ దానిని స‌ద్వినియోగం చేయ‌డంలోనే త‌డ‌బ‌డింది. త‌నీష్ బాగ్చీ ఈ పాట‌కు ట్యూన్ అందించారు.

Full View


Tags:    

Similar News