ఫ్యాన్స్ మీట్ వెనుక కార‌ణం అదేనా?

Update: 2023-01-04 23:30 GMT
థియేట‌ర్ కి వ‌చ్చే  ఆడియ‌న్స్ సంఖ్య త‌గ్గిన మాట వాస్త‌వం. ఆ కార‌ణంగా ప‌రిశ్ర‌మ‌లో ఎలాంటి అనిశ్చితి కొన‌సాగిందో కూడా చూసాం. దిద్దుబాటు చ‌ర్య‌ల్లో భాగంగా టిక్కెట్ ధ‌ర‌లు త‌గ్గించ‌డం...థియేట‌ర్ ఎక్స్ పీరియ‌న్స్ గురించి ప్రేక్ష‌కుల‌కు రీచ్ అయ్యేలా చేయ‌డం వంటి  కొన్ని స‌న్నివేశాలు క్రియేట్ చేసారు.  అలాగే మంచి సినిమాల్ని ప్రేక్ష‌కులు ఎప్పుడు ఆద‌రిస్తారు. ఆ త‌ర్వాత కొన్ని సినిమాల ఫ‌లితాల‌తోనూ సంగ‌తి అర్ధ‌మైంది.

కంటెంట్ ఉన్న సినిమాల విష‌యంలో సినీ ప్రియుడు  ఎంత పెట్టైనా  టిక్కెట్ కొంటాడ‌ని అర్ధ‌మైంది. 'కార్తికేయ‌-2'.. 'అవ‌తార్ -2' (నాన్ ఇండియ‌న్ మూవీ ) సినిమాలు వంటివి నిరూపించాయి. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో గ‌త పోకడ మ‌ళ్లీ తెర‌పైకి వ‌స్తున్న‌ట్లు క‌నిపిస్తుంది.

అదే అభిమానుల‌తో హీరోలు ఇంట‌రాక్ట్ అవ్వ‌డం. అందులోనూ ఏకంగా మెగాస్టార్ చిరంజీవి  లాంటి హీరో వాల్తేరు వీర‌య్య రిలీజ్ ప్ర‌మోష‌న్ లో భాగంగా  వైజాగ్ లో అభిమానుల‌తో ఫోటో సెష‌న్ లో పాల్గొన‌డం.. నేచుర‌ల్ స్టార్  నాని  కూడా స్పెష‌ల్ గా అభిమానుల్ని క‌లుసు కోవ‌డం..ద‌ర్శ‌కుడు బాబి ఏకంగా మెగా అభిమాన సంఘాల‌తో స‌మావేశం అవ్వ‌డం వెనుక  ఏదో బ‌ల‌మైన అంత‌రార్ధం ఉంద‌నే ప్ర‌చారం సాగుతోంది.

ఈ నేప‌థ్యంలో కొన్ని విశ్లేష‌ణ‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. హీరోల ఇమేజ్ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌ర్కౌట్ అవ్వ‌డం లేద‌ని...కంటెంట్ కి  ఇస్తోన్న  ప్రాధాన్య‌త హీరోల ఇమేజ్కి ఇవ్వ‌డం లేదు అన్న సంగ‌తి సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌కొస్తుంది. ఒక‌ప్ప‌టి అంత డై హార్డ్ ఫ్యాన్స్ ఇప్పుడు  లేరు.

అంతా అవేర్ నెస్ తో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. క‌థాబ‌లం ఉన్న‌చిత్రాల‌కు ఉన్న ప్రాధాన్య‌త‌..కాంబినేష‌న్ చిత్రాల‌కు ఉండ‌టం లేద‌ని..క్ర‌మేణా  ఈ త‌ర‌హా విధానంలో మార్పులొస్తున్నాయ‌ని కార్తికేయ‌-2 లాంటి సినిమాలు రుజువు చేస్తున్నాయని  తెలుస్తుంది.

ప్రేక్ష‌కులు...హీరోల మ‌ధ్య  ఉన్న  ఈ చిన్న వ్య‌త్యాసాన్ని తొల‌గించాలంటే ఇంట‌రాక్ష‌న్ అనేదాన్ని ఓ ఆయుధంలా  వినియోగిస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. రాజ‌కీయ నాయ‌కులు ఎన్నికల స‌మ‌యంలో ప్ర‌జ‌ల మ‌ధ్య ఎలా తిరుగుతారో..రిలీజ్ స‌మ‌యంలో హీరోలు కూడా ప్రేక్ష‌కుల మ‌ధ్య అలా తిర‌గాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌ని  అంటున్నారు. ఇప్ప‌టికే ప్ర‌చారానికి రాక‌పోతే ఎంత పెద్ద హీరో సినిమా అయినా ఢ‌మాల్  అవుతుంద‌న్న సంగ‌తి కొంద‌రి హీరోల‌కు అర్ధ‌మైంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News