#టికెట్ తంటా! ప్ర‌భుత్వ పోర్ట‌ల్ ఆ న‌లుగురికి ఓకేనా?

Update: 2021-09-29 13:24 GMT
టికెట్ తంటా అంతా ఇంతా కాదు. ప‌న్నులు ఎగ్గొడుతున్నార‌ని ఏపీ ప్ర‌భుత్వం వాదిస్తోంది. ప్ర‌భుత్వ‌మే పోర్ట‌ల్ న‌డిపిస్తే ఇలా  ఎగ్గొట్టేందుకు ఛాన్సే లేద‌నేది ఒక వాద‌న‌. అయితే దీనిపై సినీవ‌ర్గాలు మాత్రం గుర్రుమీదున్నాయ‌ని సినీపెద్ద‌ల‌కు ఇది రుచించ‌డం లేద‌ని క‌థ‌నాలొచ్చాయి. కానీ ప్ర‌భుత్వ పోర్ట‌ల్ నిర్వ‌హ‌ణ అనేది దిల్ రాజుకు కానీ.. ఆ న‌లుగురికి కానీ ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని తాజాగా తెలుస్తోంది.

ఆన్ లైన్ టికెటింగ్ విధానం కావాలని పరిశ్రమ తరపున మేమే ప్రభుత్వాన్ని కోరామ‌ని దిల్ రాజు అన్నారు. ఆన్ లైన్ విధానం ద్వారా ట్రాన్సరెన్సీ ఉంటుంది.. ఏపీ మంత్రి పేర్నితో భేటీ అనంత‌రం మీడియా స‌మావేశంలో దిల్ రాజు తెలిపారు. దీనిని బ‌ట్టి దిల్ రాజుకు దీనిపై ఎలాంటి అభ్యంత‌రం లేదు. అంటే ఆ న‌లుగురికి కానీ లేదా ఆ ప‌ది మందితో న‌డుస్తున్న నిర్మాత‌ల గిల్డ్ కి కానీ ప్ర‌భుత్వ పోర్ట‌ల్ తో స‌మ‌స్య లేన‌ట్టేన‌ని భావించాలి.

వైసీపీ వ‌ర్సెస్ జ‌న‌సేనాని వార్ నేప‌థ్యంలో దిల్ రాజు స‌హా ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు ప్ర‌భుత్వాన్ని ప్ర‌స‌న్నం చేసుకుని గొడ‌వ స‌ద్ధుమణిగేలా కృషి చేస్తుండ‌డం ర‌క్తి క‌ట్టిస్తోంది. పొలిటిక‌ల్ గేమ్ ఇండ‌స్ట్రీని నాశ‌నం చేయ‌కూడ‌ద‌నేది అంద‌రి వాద‌న.

దిల్ రాజు ఇంకా మాట్లాడుతూ.. చిరంజీవి- నాగార్జున- రాజమౌళితో కలిసి గతంలోనే సీఎం జగన్ ను మంత్రి నానీని కలిశామని నిర్మాత దిల్ రాజు తెలిపారు. పరిశ్రమ‌పై కోవిడ్ ప్రభావం.. సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాం. వకీల్ సాబ్ సినిమా సమయంలో కొన్ని పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. దయచేసి అందరూ వివాదాలకు మమ్మల్ని దూరంగా ఉంచండి. గతంలో మా విజ్ఞప్తి‌పై ఏపీ ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందించింది.. అని దిల్ రాజు అన్నారు.
Tags:    

Similar News