ఎవరి కోసం ఎప్పుడు ఎలా మారుతుందో ఎలాంటి విచిత్రాలకు.. చిత్రాలకు కారణంగా మారుతుందో ఎవరూ చెప్పలేరు. అయితే కొంత మంది ఫ్రస్ట్రేషన్ మాత్రం కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించి.. కొత్త ఫీల్ ని కలిగిస్తుంది. అలాంటి ఓ ఫ్రస్ట్రేషన్ స్టోరీ`కేజీఎఫ్` గ్యాంగ్ గడ్డం వెనక వుందట. 2018లో కన్నడ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిత్రం `కేజీఎఫ్ చాప్టర్ 1` ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కోలార్ గోల్డ్ మైన్స్ నేపథ్యంలో ఆత్యంత ఆసక్తికరమైన కథ, కథనాలతో సాగింది. ఇందులో ప్రతీ క్యారెక్టర్ రూత్ లెస్ గా మాసిన గడ్డాలతో కనిపించారు.
సినిమాకు ఇదే థీమ్ లా కనిపించింది. ఏది ఎలా వున్నా మాసీవ్ యాక్షన్ సినిమా కావడం.. పిరియాడికల్ ఫిక్షనల్ స్టోరీ కావడంతో క్యారెక్టర్స్, వారి గడ్డాల గురించి పెద్దగా ఎవరూ చర్చించుకోలేదు. సినిమా పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి కన్నడ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఐదు భాషల్లోనూ చాప్టర్ 1 కన్నడ చిత్రాల్లోనే రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి చరిత్ర సృష్టించింది.
దీందో చాప్టర్ 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే ఇటీవల విడుదలైన `కేజీఎఫ్ చాప్టర్ 2` కూడా వుండటంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి దేశ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నారు. కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన ఈ మూవీ ప్రస్తుంతం రికార్డుల మోత మోగిస్తూ కలెక్షన్ ల ప్రభంజనం సృష్టిస్తోంది. యాంగ్రీ యంగ్ మెన్ గా యష్ నటన, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టేకింగ్, టెర్రిఫిక్ స్క్రీన్ ప్లే, రవి బాస్రూర్ సంగీతం, భువన్ గౌడ ఫొటోగ్రఫీ వెరసి ఈ సినిమాని టాక్ ఆఫ్ ది ఇండియాగా నిలబెట్టాయి.
ఇదిలా వుంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమై విషయాన్ని తాజాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ బయటపెట్టారు. ఈ చిత్రంలో హీరో నుంచి చాలా పాత్రలు గడ్డంతో కనిపిస్తాయి. ప్రతీ ఒక్కరూ రూత్ లెస్ గ్యాంగ్ స్టర్స్ గా కనిపిస్తారు. దీని వెనక ప్రశాంత్ నీల్ ఫ్రస్ట్రేషన్ స్టోరీ వుందట. కొంత మందిపై వున్న కోపం కారణంగానే తాను ఈ చిత్రంలోని చాలా వరకు పాత్రలకు గడ్డం వుండేలా డిజైన్ చేశానని చెప్పుకొచ్చాడు. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గడ్డం వెనకున్న అసలు కథ బయటపెట్టాడు.
`నేను నా తొలి చిత్రం `ఉగ్రం` చేసే సమయంలో క్లీన్ షేవ్ తో కనిపించాను. అప్పుడ ఒకడు నా దగ్గరికే ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? అని నన్నే అడిగాడు. మూవీ రిలీజ్ అయ్యాక కూడా నువ్వేనా డైరెక్టర్ అని మళ్లీ అడిగారు. నాకు కోపం వచ్చింది. ఆ కోపం, ఫ్రస్ట్రేషన్ తో `కేజీఎఫ్` సినిమాలో ప్రతి ఒక్కరికి గడ్డం వుండాలని డిజైన్ చేశాను. అని కేజీఎఫ్ గ్యాంగ్ గడ్డం వెనకున్న ఫ్రస్ట్రేషన్ స్టోరీని బయటపెట్టాడు. దీంతో నెటిజన్స్ ప్రశాంత్ నీల్ పై కామెంట్ లు చేస్తున్నారు.