ఇలయదళపతి విజయ్ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 20 గంటల పాటు విజయ్ ను అధికారులు ప్రశ్నించారు. తన ప్రస్తుత పారితోషికం.. ఆస్తుల విలువలపై సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఇటీవలి కాలంలో వరుసగా విజయ్ సినిమాలు సక్సెస్ అవ్వడంతో ఆ సినిమాలకు తీసుకున్న పారితోషికం లెక్కలన్నింటినీ అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే విజయ్ పై వరుస దాడుల నేపథ్యంలో ఆయన ఫ్యాన్స్ రంగంలోకి దిగి ఉద్రిక్తతకు కారణమైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తమ ఫేవరెట్ పై ఐటీ దాడుల విషయం తెలియగానే అభిమానులు నేరుగా విజయ్ ఇంటికి చేరుకుని రక్షణ కవచంలా కాపాలా కాసారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజాపా పార్టీ విజయ్ ని టార్గెట్ చేసిందని.. అందుకే ఐటీ దాడులు చేసి తమ హీరోని బజారుకు లాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసి ధర్నాకు దిగారు. దీంతో విజయ్ ఇంటిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీగా పోలీసులు మెహరించి విజయ్ ఇంటి వైపు వచ్చిన అభిమానులను కట్టడి చేసారుట.
అంతకు ముందు అభిమానులు విజయ్ ఇంటిని చుట్టుముట్టి బయటి వ్యక్తులు ఎవరూ లోపలికి రాకుండా బార్డర్ లో సైనికుల్లా కాపాలా కాసారుట. పోలీసులు ఎంట్రీతో సీన్ కాస్త సీరియస్ అయినప్పటికీ విజయ్ అభిమానులను కంట్రోల్ గా ఉండమని సూచించడంతో వాతావరణం మారిందని..లేదంటే పోలీసులు..అభిమానుల మధ్య పెద్ద యుద్దమే జరిగేదని కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఐటీ దాడులు...పోలీసుల పహారా నేపథ్యంలో కొంత మంది అభిమానుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.