హీరోగా కెరీర్ ముగిసిపోయి నెక్స్ట్ ఏం చేయాలి అనే సందిగ్ధం వచ్చినప్పుడు జగపతిబాబు లెజెండ్ సినిమాలో విలన్ గా చేయడం అతని కెరీర్ ని ఊహించని మలుపు తిప్పింది. అది ఏ స్థాయిలో అంటే ఏకంగా బాలీవుడ్ కోలీవుడ్ ల నుంచి సైతం ఊపిరాడని స్థాయిలో ఆఫర్లు వచ్చేంతగా.
ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే ప్రియుడిగా భర్తగా అప్పటిదాకా సాఫ్ట్ ఇమేజ్ ఉన్న జగపతి బాబు తనలో ఎంత క్రూరమైన ప్రతినాయకుడు ఉన్నాడో లెజెండ్ తో మొదలుకుని గత ఏడాది వచ్చిన రంగస్థలం దాకా ప్రతిసారి నిరూపిస్తూనే ఉన్నాడు.అయితే ఇవి ఎన్ని చేసినా లెజెండ్ ఎప్పటికీ స్పెషల్ గా నిలిచిపోతుంది.
దాని తర్వాత బాలయ్య జగపతి మరోసారి కలిసి నటించే ఛాన్స్ దక్కలేదు. మళ్ళి ఇప్పుడు ఆ కలయిక జరగబోతున్నట్టు సమాచారం.కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మించే మూవీలో బాలయ్యకు సై అంటే సై అని సవాల్ విసిరే విలన్ పాత్రకు జగపతి బాబునే ఎంచుకున్నట్టు ఫ్రెష్ అప్ డేట్. ఇది అఫీషియల్ గా ప్రకటించలేదు కాని దాదాపు ఓకే అయినట్టు వినికిడి.
ఇదే కనక నిజమైతే మరోసారి పవర్ఫుల్ యాక్షన్ కాంబోని తెరపై చూసుకోవచ్చు. తనకు జైసింహ లాంటి కమర్షియల్ పాస్ మూవీని ఇచ్చిన కెఎస్ రవికుమార్ కు బాలయ్య మరోసారి అవకాశం ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎన్నికల ఫలితాలకు ముందే దీని షూటింగ్ ప్రారంభం కావొచ్చని ఇన్ సైడ్ టాక్.