నవీన్ పోలిశెట్టి - ఫరీదా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ''జాతిరత్నాలు''. ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ లో రాహుల్ రామకృష్ణ - ప్రియదర్శి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్ పతాకంపై 'మహానటి' నాగ్ అశ్విన్ నిర్మించారు. థియేటర్స్ లో నవ్వులు పూయించిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే సినిమా విడుదలై ఇన్ని రోజులవుతున్నా హాస్య రత్నాల సందడి మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా 'జాతిరత్నాలు' చిత్రం నుంచి డిలీటెడ్ సీన్స్ ని మేకర్స్ యూట్యూబ్ లో విడుదల చేశారు.
ఇందులో పార్టీ ఆఫీస్ లోకి వెళ్లి ఫోన్ ఇచ్చినమంటే మన లైఫ్ సెట్ అయినట్లేరా అనుకుంటూ.. ముగ్గురిలో ఎవరు లోపలికి వెళ్లి ఆ ఫోన్ ఇవ్వాలి అని జాతిరత్నాలు డిస్కషన్ చేసుకునే ఫన్నీ సీన్ అలరిస్తోంది. అలానే ముగ్గురు డ్రింక్ చేస్తూ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకుంటూ మీ ఇద్దరూ నాకు రెండు కళ్ళురా అంటూ నవీన్ చెప్పే సీన్.. జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే నెలకు 30వేలు ఇస్తే చెయ్యను, ఏడాదికి 2 లక్షలు ఇస్తేనే చేస్తానని నవీన్ చెప్పే ఫన్నీ సీన్ ఉన్నాయి. హీరోయిన్ పెళ్లి చూపుల ఫంక్షన్ గురించి చెప్పడానికి వచ్చిన సన్నివేశం.. రాహుల్ రామకృష్ణ తన సిస్టర్ మ్యారేజ్ కి మంచి మందు పెట్టానని, కానీ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ పెళ్లికి చీఫ్ మందు పెట్టారని ప్రశ్నించే సీన్ లని కూడా తొలగించారు. ఎడిటింగ్ లో డిలీట్ చేసిన ఈ ఐదు సన్నివేశాలు చూసిన ఆడియన్స్ ఇవి కూడా నవ్వు తెప్పిస్తున్నాయని.. ఎందుకు తొలగించారని కామెంట్స్ చేస్తున్నారు.
కాగా, 'జాతిరత్నాలు' సినిమాకి రథన్ సంగీతం సమకూర్చగా.. మనోహర్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. అభినవ్ ఎడిటింగ్ వర్క్ చేశారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం - సీనియర్ నరేష్ - మురళీ శర్మ - వెన్నెల కిశోర్ - బ్రహ్మజీ - తనికెళ్ల భరణి తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
Full View