ఫోటో స్టోరి: ఒళ్లంత తుళ్లింత కావాలిలే!

Update: 2019-09-28 01:30 GMT
ఒళ్లంత తుళ్లింత కావాలిలే.. గుండెల్లో జల్లంతా కురవాలిలే!! అంటూ గీతాంజలి గిరిజను త‌ల‌పిస్తోంది జాన్వీ. ఏదో కొత్త లోకంలో న‌చ్చిన‌ట్టు విహరించేస్తోంది. ఈ టీనేజీనే అంత‌. అలా కంగారు పెట్టేస్తుంటుంది. గాల్లో రాతలు రాయాల‌నిపిస్తుంది. నీటిలో తుళ్లిప‌డాలనిపిస్తుంటుంది. ప్ర‌స్తుతం ఈ క‌పూర్ గాళ్ స‌న్నివేశం అంతే ఇదిగా ఉంది మ‌రి.

పాపా బోనీక‌పూర్ తో క‌లిసి సిస్ట‌ర్ ఖుషీ కపూర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన జాన్వీ అమెరికా విహారంలో ఇలా చిలౌట్ చేస్తోంది. అక్క‌డ న్యూయార్క్ న‌గ‌రంలో ఓ మాంచి పార్క్ ఏరియాలో వాట‌ర్ ఫౌంటైన్ ముందు ఇదిగో ఇలా నీళ్ల‌లో త‌డుస్తూ ఆట‌లాడుకుంటోంది. అస‌లే పొట్టి నిక్క‌రులో అలా త‌డుస్తూనే న‌వ్వులు చిందిస్తూ ఉన్న ఫోటోల్ని ఇన్ స్టాలో షేర్ చేసింది జాన్వీ.

ఈ ఫోటో చూడ‌గానే క్యూట్ .. ల‌వ్ లీ అంటూ అభిమానులు స్పందించారు. ఒక అభిమాని అయితే ఏకంగా నా పేరును న్యూయార్క్ అని మార్చుకుంటున్నా! అంటూ ఫ‌న్నీగా కామెంట్ చేశాడు. మొత్తానికి ఈ ట్రిప్ ని జాన్వీ ఖుషీ కంటే బాగానే ఎంజాయ్ చేస్తోంది. పాపం సిస్ ఇంకా అక‌డ‌మిక్ స్ట‌డీస్.. న‌ట శిక్ష‌ణ అంటూ క‌ఠోరంగా శ్ర‌మిస్తుంటే జాన్వీకి మాత్రం ఆట‌విడుపుగా ఉంది. జాన్వీ ఇన్ స్టా ఫోటోలు జోరుగా వైర‌ల్ అయిపోతున్నాయి.



Tags:    

Similar News