చెల్లెలు విదేశాల్లో.. జాన్వీ టైమ్ పాస్ ఎవ‌రితో?

Update: 2019-09-21 15:58 GMT
శ్రీ‌దేవి గారాప‌ట్టి జాన్వీ క‌పూర్ బాలీవుడ్ దునియాలోని ఎంట‌రైంది మొద‌లు నిరంత‌రం ఏదో ఒక రూపంలో వార్త‌ల్లో నానుతోంది. మారాఠీ చిత్రం `సైరాఠ్‌` ఆధారంగా క‌ర‌ణ్ జోహార్ నిర్మించిన `ధ‌డ‌క్‌` సినిమాతో తెరంగేట్రం చేసి తొలి సినిమాతోనే శ్రీ‌దేవికి సిస‌లైన న‌ట‌ వార‌సురాల‌నిపించుకుంది. అందం అభిన‌యంలో మామ్ గ‌ర్వ‌ప‌డే వార‌సురాలు అని పొగిడేశారు క్రిటిక్స్. చ‌క్క‌ని అభిన‌యంతో కూడిన పాత్రతో తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన జాన్వీ వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా గ‌డుపుతోంది. బాలీవుడ్ యువ‌నాయిక‌ల్లో జెట్ స్పీడ్ తో కెరీర్ ని ప‌రుగులు పెట్టిస్తున్న క‌థానాయిక‌గా జాన్వీక‌పూర్ పేరు మార్మోగుతోంది.

త్వ‌ర‌లోనే సోద‌రి ఖుషీ క‌పూర్ బ‌రిలో దిగుతోంది. ఇటీవ‌లే న్యూయ‌ర్క్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కి వెళుతున్న‌ చెల్లెలు ఖుషీని అమెరికా పంపించిన జాన్వీ తీరిక స‌మ‌యాల్లో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ఇదిగో ఇలా కుక్క‌పిల్ల తో కాలం గ‌డిపేస్తోంది. ఆట‌విడుపుగా ఆ ప‌ప్పీకి ప‌ప్స్ తినిపిస్తోంది. బ్రౌన్ క‌ల‌ర్ లో ఆ ప‌ప్పీ ఎంతో క్యూట్ గా ముద్దొస్తోంది. జాన్వీ ప‌ప్పీతో ఆడుకుంటున్న ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఉద‌యం జిమ్‌ లో గ‌డిపేస్తూ ఆ త‌రువాత షూటింగ్‌ లలో పాల్గొంటూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపేస్తున్న జాన్వీక‌పూర్‌ కు ఇదో ఆట‌విడుపుగా మారిందా అన్న‌ది త‌నే చెప్పాలి.

కెరీర్ ప‌రంగా చూస్తే.. జాన్వీ చేతిలో ప్ర‌స్తుతం మూడు క్రేజీ ప్రాజెక్ట్‌లున్నాయి. క‌ర‌ణ్ జోహార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న `త‌క్త్‌` చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. దీనితో పాటు హార్ధిక్ మెహ‌తా రూపొందిస్తున్న `రూహీ ఆఫ్జా`లో తొలిసారి డ్యుయెల్ రోల్ లో క‌నిపించ‌బోతోంది. ఇండియ‌న్ తొలి ఏయిర్ ఫోర్స్ మ‌హిళా పైలెట్ గుంజ‌న్ స‌క్సేనా జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని క‌ర‌ణ్‌ జోహార్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ వ‌చ్చే ఏడాది మార్చిలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. 


Tags:    

Similar News