ఎన్టీఆర్- కథానాయకుడు ఆడియో వేదిక సాక్షిగా కొన్ని నిజాలు బయటపడ్డాయి. నందమూరి ఫ్యామిలీ డ్రామా.. నందమూరి కూంబింగ్ బయటపడింది. ఈ వేదిక సాక్షిగా నందమూరి హీరోలంతా ఓచోట ఏకమైన సంగతి తెలిసిందే. అలాగే నందమూరి ఫ్యామిలీ పెద్దలంతా ఈ వేదిక వద్దకు వచ్చారు. నటసింహా నందమూరి బాలకృష్ణ- యంగ్ టైగర్ ఎన్టీఆర్- కళ్యాణ్ రామ్ ఒకే వేదిక పైకి వచ్చారు. ఆ వేడుక ను నందమూరి ఫ్యామిలీ వేడుక గా నిర్వహించారు. నారా బ్రాహ్మణి సహా నందమూరి కుటుంబంలో పెద్దలు- పిల్లలు అంతా ఈ ఈవెంట్ కి విచ్చేశారు. తన చుట్టాల్లో మామలు- అక్కలు- వారి పిల్లలు అందరినీ పేరు పేరునా ప్రస్థావిస్తూ బాలయ్య ఎంతో ఎమోషన్ అయిపోయారు. ఇక నందమూరి కుటుంబం ఉన్న ఇదే వేదిక పై తారక్ ఎమోషన్ అయిన తీరు అంతే ఇదిగా చర్చకొచ్చింది.
ముఖ్యంగా కథానాయకుడు వేదిక పై బాబాయ్ బాలయ్య పై తనకు ఉన్న ప్రేమాభిమానాలు అంతా ఇంతా కాదని చెప్పేందుకు అబ్బాయ్ తారక్ ఎంతో ఇదయ్యాడు. అతడిలో ఎమోషన్ కట్టలు తెంచుకుంది. ఆ ఎమోషన్ మాటలుగా ధారాలంగా ప్రవహించింది. ఎన్టీఆర్ చిత్రం తెరకెక్కించిన బాబాయ్ గురించి ప్రత్యేకంగా ప్రస్థావిస్తూ.. మా పిల్లలు అడిగితే ఒకటి చెబుతాను. ``మా తాత గురించి మీ తాత చేసిన చిత్రం ఒకటుందని చెబుతాను`` అనీ వ్యాఖ్యానించారు తారక్. ఆ మహానుభావుడి చరిత్రను అందిస్తున్నందుకు గర్వంగా ఉంది బాబాయ్. మీ గురించి ఎంత పొగిడినా సరిపోదు. భావితరాలకు ఒక మహానుభావుడి చరిత్రను అందిస్తున్నందుకు గర్వంగా ఉంది. ఆయన ఎన్నో సినిమాలు చూశాను. బాబాయ్ లో తెర పై నేను పెద్దాయన్నే చూసుకుంటున్నా అని టెంప్టింగ్ స్పీచ్ ని ఇచ్చారు తారక్.
అయితే తారక్ ఇంతగా ఎమోషన్ అవ్వడానికి కారణం వేదిక దిగువన అంతా నందమూరి ఫ్యామిలీ సభ్యులంతా వేచి చూస్తున్నందుకేనని భావించవచ్చు. చాలా కాలంగా నందమూరి కుటుంబం విభేధాలతో చెల్లా చెదురుగా ఉంది. ఇలా ఒకేచోట ఫ్యామిలీ సభ్యులంతా రాజకీయాలకు అతీతంగా ఓచోట చేరేసరికి తారక్ ఎమోషన్ అయ్యాడు. ఇక వేదిక పై ఉన్న బాలయ్య బాబు అబ్బాయ్ లు తారక్- కళ్యాణ్ రామ్ తో ఎంతో జోవియల్‌గా కనిపించి ఎమోషన్ కి తావిచ్చాడు. అబ్బాయ్ లతో సరదాగా వెటకారాలాడేస్తూ కనిపించాడు. ఇదంతా చూస్తుంటే నందమూరి కూంబింగ్ జరిగిందా? అనిపించింది.