టాలీవుడ్ లో ప్రస్తుతం అత్యధిక పారితోషికం అందుకుంటున్న స్టార్స్ లో ముందు వరుసలో ఉండే హీరో ఎన్టీఆర్. ప్రస్తుతం ఆయన చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాకు గాను పారితోషికం మరియు లాభాల్లో వాటా కలిపి దాదాపుగా రూ.50 కోట్ల వరకు ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా బాహుబలి రేంజ్ లో సక్సెస్ అయితే ఎన్టీఆర్ పారితోషికం మరో పది లేదా ఇరవై కోట్లు పెరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు. అంతటి పారితోషికంను అందుకుంటున్న ఎన్టీఆర్ మొదటి పారితోషికం ఎంత అయ్యి ఉంటుందని చాలా మందికి అనుమానం ఉండే ఉంటుంది.
ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చి దాదాపుగా రెండు దశాబ్దాలు అయ్యింది. ఆ సమయంలో పారితోషికాలు చాలా తక్కువగానే ఉన్నాయి. కనుక ఓ పాతిక లక్షల వరకు తీసుకుని ఉంటాడని మీరు అనుకుంటే పొరపాటే. అప్పట్లో కూడా హీరోలు కోట్లలో పారితోషికాలు అందుకుంటున్నారు. అలాంటి సమయంలో ఎన్టీఆర్ హీరోగా మొదటి పారితోషికంను రామోజీరావు వద్ద నుండి అందుకున్నాడు. అది ఎంత అంటే నాలుగు లక్షల రూపాయలు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ లో నిర్మాణం జరిగిన ఈ సినిమాకు వంకినేని రత్న ప్రతాప్ దర్శకత్వం వహించాడు. మొదటి సినిమా నిన్ను చూడాలని షూటింగ్ మొదలు అయిన సమయంలో ఎన్టీఆర్ వయసు 17 ఏళ్లు. అంత చిన్న వయసులో హీరో ఏంటీ అంటూ కొందరు పెదవి విరిచిన సందర్బాలు కూడా ఉన్నాయి.
17 ఏళ్ల వయసులో షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఎన్టీఆర్ 18 వ ఏట అడుగు పెట్టిన తర్వాత సినిమా ను విడుదల చేశారు. సినిమా నిరాశ పర్చినా కూడా ఆ సినిమాకు తీసుకున్న నాలుగు లక్షల పారితోషికంను చాలా కాలం పాటు గుర్తు పెట్టుకున్నాడు. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాక అమ్మ చేతిలో ఆ డబ్బును పెట్టాడట. ఎన్నో సార్లు ఆ డబ్బును ఎన్టీఆర్ లెక్కిస్తూ ఉండేవాడట. ఇప్పుడు ఎన్టీఆర్ తనకు వచ్చే పారితోషికంను లెక్కించాలనుకుంటే ముగ్గురు నలుగురు మనుషులను పెట్టుకోవాలేమో..!