శంకరాభరణం.. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన సినిమా. తెలుగు సినిమా ఉన్నంత వరకు నిలిచి ఉండే గొప్ప సినిమా. అలాంటి టైటిల్ ను టచ్ చేయడమంటే సాహసమే. పైగా ఈ టైటిల్ పెట్టి ఓ క్రైమ్ కామెడీ తీయడం ఇంకా పెద్ద సాహసమే. అందుకే కోన వెంకట్ అండ్ టీంపై మొదట్లో విమర్శలు వచ్చాయి. ఇప్పటికీ ఆ టైటిల్ విషయంలో చాలామందికి అభ్యంతరాలున్నాయి. మరి ‘శంకరాభరణం’ పేరుతో కళాఖండం తీసిన విశ్వనాథ్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఈ టైటిల్ గురించి తెలిసి ఆయనేమని ఉంటారు? ఈ సంగతేంటో కోన వెంకట్ మాటల్లోనే తెలుసుకుందాం పదండి.
‘‘ఈ సినిమాకు శంకరాభరణం అని టైటిల్ అనుకోగానే విశ్వనాథ్ గారికి విషయం చెప్పాను. నేను రాసిన, తీసిన సినిమాలన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలాగే ఉంటాయని.. బూతు కంటెంట్ ఉన్న సినిమాలు చేయలేదని.. శంకరాభరణం టైటిల్ ను చెడగొట్టబోనని చెప్పాను. దానికి ఆయన ‘ఏ కారణం లేకుండా ఆ టైటిల్ పెట్టవని నాకు తెలుసులేవయ్యా’ అన్నారు. అంతే కాదు మా సినిమా ఆడియో ఫంక్షన్ కు వచ్చి తొలి పాట ఆయనే లాంచ్ చేశారు. ఇక ఈ సినిమాకు శంకరాభరణం అనే టైటిల్ ఎందుకు పెట్టామన్నది సినిమా మొదలైన 5 నిమిషాలకే తెలిసిపోతుంది. ముందు ఈ టైటిల్ అనుకున్నపుడు జస్టిఫికేషన్ గురించి ఆలోచించలేదు కానీ తర్వాత టైటిల్ జస్టిఫై చేసేలా కథను తీర్చిదిద్దాం. ప్రయోగాత్మకంగా తీస్తున్న సినిమా కాబట్టి టైటిల్ జనాల నోళ్లల్లో నానాలనే ఉద్దేశంతోనే ఈ పేరు పెట్టాం’’ అని కోన చెప్పాడు.