కాజల్ అగర్వాల్ సౌత్ లో ఇప్పుడు మళ్ళీ రేస్ మొదలుపెట్టింది. ఖైదీ నంబర్ 150 మూవీతో మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది ఈ బ్యూటీ. ఇప్పుడు మళ్ళీ అజిత్ నటిస్తున్న ‘వివేగం’ లోను.. అలాగే విజయ్ మూవీలోను చేస్తోంది. హిందీలో కొన్ని సినిమాలలో నటించినా.. సౌత్ ఫిల్మ్స్ లో వచ్చినంత గుర్తింపులో పదో వంతు కూడా దక్కలేదు. అందుకే తనను స్టార్ గా గుర్తించిన చేసిన సౌత్ సినిమాలపై ఇప్పుడు ఫోకస్ చేసింది.
ఈ మధ్య హిందీ సినిమాలపై ఫోకస్ తగ్గించడానికి కారణమేంటనే ప్రశ్న కాజల్ కు ఎదురైంది. 'నేను అసలు ఇక్కడే పుట్టాల్సి ఉంది. పొరపాటున నార్త్ లో పుట్టేశాను. నాకు సౌత్ ఫుడ్ అన్నా.. ఇక్కడ మనుషులు అన్నా చాలా ఇష్టం. నాకు ఇక్కడ అన్నీ నచ్చుతాయి. ఒక నార్త్ అమ్మాయి ఇక్కడ ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతుందోని చాలామంది ఆశ్చర్యపోతారు. నాకు సౌత్ సినిమాలు చేయడమే ఇష్టం. హిందీ సినిమాల కోసం ఇక్కడ మంచి ఆఫర్లను వదులుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు సినిమా జీవితం ఇచ్చింది తెలుగు తమిళ్ సినిమాలే కదా.. నేను ఎక్కడికి వెళ్ళిన ఇదే నా స్వస్థలం' అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చేసింది కాజల్.
ఒకవేళ మళ్లీ మంచి ఛాన్స్ వచ్చి బాలీవుడ్ వెళ్లినపుడు.. 'నేను ఇక్కడే పుట్టా.. నేను లోకల్' అనేసినా ఆశ్చర్యం లేదులే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/