బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - కాజల్ అగర్వాల్ జంటగా తేజ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోందన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ తేజకు ముక్కుమీదే కోపం ఉంటుందని.. సెట్స్ లో నటులపై చేయి చేసుకుంటాడని ఇండస్ట్రీలో టాక్ ఉంది. కానీ తేజ పూర్తిగా మారినట్టుగా ఉన్నాడు. ఎందుకంటే శ్రీనివాస్ - కాజల్ కలిసి షూటింగ్ లొకేషన్ లో చేసే అల్లరి ఆ అరేంజ్ లో ఉంది మరి.
ఇప్పటికే కికి ఛాలెంజ్ ను ఇద్దరూ కలిసి చేసి 'సేఫ్ కికి' చేయమని ప్రేక్షకులకు ఒక వీడియో సందేశం ఇచ్చారు. ఆ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా శ్రీనివాస్ ఏనుగు దంతాలపై కూర్చున్న ఫోటో ఒకటి పోస్ట్ చేశాడు. ఇక దానిపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి . తాజాగా బెల్లంకొండ బాబు ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా మరో పిక్ పోస్ట్ చేశాడు.. అందులో బాహుబలి సినిమాలో ప్రభాస్ శివలింగం ఎత్తుకున్న టైపులో శ్రీనివాస్ కాజల్ ను భుజాలపై ఎక్కించుకున్నాడు. ఇక రెండు చేతుల పైకెత్తి నన్ను చూడండి.. నా స్టైల్ చూడండి అన్నట్టుగా ఒక పోజిచ్చాడు. ఇక టాలీవుడ్ చందమామ కాజల్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లాగా ఒక చేయి పైకెత్తి మరో చేతిని నడుముపై స్టైల్ గా పెట్టుకుంది.
ఇక ఈ ఫోటోలపై నెటిజనులు తలోరకమైన కామెంట్స్ పెట్టారు. ఒకరు పెళ్లి చేసుకోండి అని సలహా ఇస్తే మరొకరు షూటింగ్ చేస్తున్నారా లేదా ఫోటో షూట్ మాత్రమేనా అని సెటైర్ వేశారు. ఇక షూటింగ్ ఎక్కడ జరుగుతోందనే సంగతి చెప్పుకోవడం మర్చిపోయాం కదా... అంగ్ కోర్ వాట్ టెంపుల్.. కంబోడియా.