ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అశ్లీల వీడియోల కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆయన మీద నమోదైన కేసు అశ్లీల చిత్రాల నిర్మాణం, ప్రదర్శనకు సంబంధించింది కావడంతో అందరూ షాక్ కు గురయ్యారు.అయితే ఈ వివాదం ఫిబ్రవరిలోనే మొదలైందని.. పోలీసులకు రాజ్ కుంద్రం రూ.25 లక్షల లంచం ఇచ్చి మేనేజ్ చేశాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
తాజాగా జూలై 19న రాజ్ కుంద్రా అరెస్ట్ తో వ్యవహారం బట్టబయలైంది. ఇక భర్త అరెస్ట్ తో శిల్పాశెట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆమె మీడియా ముందుకు రాలేకపోతున్నారు. ప్రశ్నల వర్షం కురిపిస్తారని బయటకు రావడం లేదు.
గత ఏడాది ఇది ఫిబ్రవరి 4వ తేదీన మహిళలను బలవంతంగా శృంగార సినిమాల్లోకి నెట్టిన ఆరోపణలపై ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో విచారణ ప్రారంభించిన మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులకు పోర్న్ చిత్రాల వ్యాపార రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. బ్రిటన్ వేదికగా నడుస్తున్న యుకె ప్రొడక్షన్ అధిపతి ఉమేష్ కామత్ తో రాజ్ కుంద్రా కు సంబంధాలున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సినిమాల్లో, టెలివిజన్లలో నటించేందుకు ఉత్సాహం చూపించే మోడల్స్, అమ్మాయిలను వీరు టార్గెట్ చేస్తారు. వెబ్ సిరీస్, ఇతర షూటింగులు జరుపుతున్నట్లు నమ్మించి చివరి క్షణంలో స్క్రిప్ట్ మార్చేస్తారని పోలీసులు చెబుతున్నారు.
ముంబై శివార్లలో షూటింగ్ చేసిన అనంతరం శృంగార వీడియోలను సోషల్ మీడియాలో ఉంచుతారు. సదరు వీడియోలను మన దేశంలో ప్రసారం చేయడం నేరం కాబట్టి బయట దేశాల్లోని సర్వర్ల ద్వారా హాట్ షాట్ అనే యాప్ లోకి అప్లోడ్ చేస్తున్నారు. లాక్ డౌన్లో పుణ్యమా అని సదరు యాప్ లోకి వివరాలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి చేరారు. వీరు నుంచి చి డబ్బులు వసూలు చేసి వాటి ప్రసారాలను అందజేస్తారు. ఈ నెల 19వ తేదీన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు.
రాజ్ కుంద్రా కేసు ముంబైలో చర్చనీయాంశంకావడంతో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఈ వివాదంపై స్పందించారు. దేని గురించైనా వివాదాస్పద రీతిలో స్పందించే కంగనా తాజాగా 'తలైవి' మూవీ ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడింది. సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసింది.
కంగన మాట్లాడుతూ 'బాలీవుడ్ కాదు బులీవుడ్' అంటూ తీవ్రంగా విమర్శించింది. ముంబై చిత్ర పరిశ్రమని గట్టర్ తో పోల్చింది. అంతా కంపు, చెత్తే అంటూ తిట్టిపోసింది. తన తర్వాత మూవీ 'టీకు వెడ్స్ షేరు'లో బాలీవుడ్ చీకటి కోణాల్ని చూపిస్తానని కంగనా సంచలన ప్రకటన చేసింది.