సూసైడ్ గ్యాంగ్ .. దావూద్ లింకులు అంటూ కంగ‌న తీవ్ర వ్యాఖ్య‌లు

Update: 2020-09-17 08:50 GMT
క్వీన్ కంగ‌న ర‌నౌత్ మాట‌ల యుద్ధం ప‌రాకాష్ట‌కు చేరుకుంటోంది. త‌న‌పై స‌వాళ్లు విసిరే బాలీవుడ్ నెపోటిజం స్టార్ల‌ను .. సినీ పెద్ద‌ల గూడుపుటానీ మాఫియాని .. రాజ‌కీయ నాయ‌కుల్ని మీడియాని ఎవ‌రినీ వ‌దిలి పెట్ట‌డం లేదు. దొరికితే దబాయించేస్తూ కౌంట‌ర్ల‌తో వెంటాడుతోంది.

తాజాగా కంగనా రనౌత్ ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ ల‌వ్ క‌పుల్ గా ప్ర‌చార‌మైన‌ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ... సారా అలీ ఖాన్ విడిపోయేందుకు క‌రీనా కార‌ణ‌మ‌ని అందుకు మీడియానే సాయ‌ప‌డింద‌ని కూడా పంచ్ వేసంది కంగ‌న‌. తన మొదటి సహనటుడు (సుశాంత్) తో డేటింగ్ చేయవద్దని సారాను ఆమె స్టెప్ మామ క‌రీనా ఎలా కోరిందో కూడా కంగ‌న వివ‌ర‌ణాత్మ‌కంగా ఆ ఇంట‌ర్వ్యూలో మాట్లాడింది. ఆ మాట‌ల్లోనే పంచ్ లు విసిరేసింది క్వీన్  కంగన.. ``మీడియా .. ఇత‌ర‌ బి-టౌన్ విభాగం సుశాంత్‌‌-సారా జంట‌ విడిపోయేలా చేశారు. ఈ ‘సూసైడ్ గ్యాంగ్ ’ నన్ను కూడా లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించింది`` అంటూ అద‌ర‌క బెద‌ర‌క లైవ్ ఇంట‌ర్వ్యూలో తీవ్ర వ్యాఖ్యలు చేసింది కంగ‌న‌.

బాలీవుడ్ లో మాదకద్రవ్యాల వాడకం.. శివసేన నాయకుడు సంజయ్ రౌత్ తో కంగ‌న‌ వైరం.. స్వపక్షపాతం..త‌దిత‌ర విష‌యాల‌పై కంగ‌న మాట్లాడింది. అక్ర‌మ ఆస్తి అంటూ బీఎంసీ త‌న ఇల్లు కార్యాల‌యాల్ని కూల్చేసేందుకు కుట్ర ప‌న్నింద‌ని కంగ‌న ఆరోపించింది. పాత కాలంలో చిత్ర పరిశ్రమ మంచిదని కూడా చెప్పింది. ఎందుకంటే, ``అప్పటికి ఏ అండర్ వ‌రల్డ్ వ్యక్తి వారికి డబ్బు ఇవ్వలేదు... ఇప్పుడు బి-టౌన్ తో దావూద్ లింకులు ఓపెన‌య్యాయి`` అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది కంగ‌న‌.
Tags:    

Similar News